సెలబ్రేషన్ మొదలైంది!
ABN , First Publish Date - 2020-11-04T07:02:00+05:30 IST
హర్ష్ కనుమిల్లి, సిమ్రాన్ చౌదరి జంటగా ‘సెహరి’ చిత్రం మంగళవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో...

హర్ష్ కనుమిల్లి, సిమ్రాన్ చౌదరి జంటగా ‘సెహరి’ చిత్రం మంగళవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో అద్వయ జిష్ణు రెడ్డి, శిల్పా చౌదరి నిర్మిస్తున్నారు. సంగీత దర్శకుడు కోటి కీలక పాత్ర పోషిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి దిల్‌రాజు క్లాప్ ఇవ్వగా, అల్లు బాబీ కెమెరా స్విచాన్ చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘సెహరి అంటే సెలబ్రేషన్. న్యూ ఏజ్ లవ్‌స్టోరీ ఇది. సినిమా లవ్ సెలబ్రేషన్‌లా ఉంటుంది. 20 నిమిషాల కథ విని కోటిగారు ఓ కీలక పాత్ర పోషించడానికి అంగీకరించారు. హీరోహీరోయిన్ల జంట తెరపై చూడముచ్చటగా ఉంటుంది’’ అని అన్నారు. ‘‘నా స్నేహితుల జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ కథ రాశా’’ అని హీరో చెప్పారు. వచ్చేవారం రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని నిర్మాతలు తెలిపారు.
Read more