రియా పక్కింటి వ్యక్తికి సీబీఐ వార్నింగ్!

ABN , First Publish Date - 2020-10-12T18:20:27+05:30 IST

డ్రగ్స్ కేసులో దాదాపు 28 రోజుల పాటు జైలు జీవితం గడిపిన బాలీవుడ్ హీరోయిన్ రియా చక్రవర్తి

రియా పక్కింటి వ్యక్తికి సీబీఐ వార్నింగ్!

డ్రగ్స్ కేసులో దాదాపు 28 రోజుల పాటు జైలు జీవితం గడిపిన బాలీవుడ్ హీరోయిన్ రియా చక్రవర్తి ఇటీవలె బెయిల్‌పై విడుదలైంది. సుశాంత్ మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న రియాపై ఎంతో మంది విమర్శలు చేశారు. రియా పక్కింట్లో ఉండే డింపుల్ తవాని అనే మహిళ ఇచ్చిన స్టేట్‌మెంట్ బాగా సంచలనం అయింది. 


జూన్ 13 రాత్రి రియాను సుశాంత్ కార్‌లో డ్రాప్ చేశాడని డింపుల్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. సుశాంత్ మరణించిన ముందు రోజు రాత్రి రియా, సుశాంత్ కలిసి ఉన్నారని ఆమె వెల్లడించారు. అయితే ఆదివారం సీబీఐ ఎంక్వైరీకి హాజరైన ఆమె మాట మార్చినట్టు వార్తలు వస్తున్నాయి. రియా, సుశాంత్ కలిసి ఉండడం తను స్వయంగా చూడలేదని, ఎవరో తనకు చెబితే విన్నానని ఆమె చెప్పినట్టు సమాచారం. `మీకు చెప్పిన వ్యక్తిని గుర్తు పడతారా?` అని అడగ్గా.. `ఆ వ్యక్తి సమాచారం బయట పెట్టలేన`ని డింపుల్ సమాధానం ఇచ్చారట. అలాగే సుశాంత్, రియా కలిసి ఉండడాన్ని ఆ వ్యక్తి ఎప్పుడు, ఎక్కడ చూశారనే విషయాన్ని కూడా డింపుల్ చెప్పలేకపోయారట. దీంతో సీబీఐ ఆమెకు వార్నింగ్ ఇచ్చిందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆధారాలు లేకుండా మాట్లాడితే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని డింపుల్‌ను హెచ్చరించినట్టు సమాచారం.   

Updated Date - 2020-10-12T18:20:27+05:30 IST

Read more