సుశాంత్ కేసులో ఊహించని నిర్ణయం తీసుకున్న సీబీఐ..!
ABN , First Publish Date - 2020-08-25T23:09:29+05:30 IST
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో సీబీఐ దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ఇద్దరు ముంబై పోలీసులకు...

సుశాంత్ కేసులో ఇద్దరు ముంబై పోలీసులకు సీబీఐ సమన్లు
ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో సీబీఐ దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ఇద్దరు ముంబై పోలీసులకు సీబీఐ సమన్లు పంపింది. సుశాంత్ కేసును దర్యాప్తు చేసిన పోలీసు సిబ్బందిలో ఒకరైన భూషణ్ బెల్నేకర్‌కు, బాంద్రా పోలీస్ స్టేషన్ ఎస్ఐకి సీబీఐ సమన్లు పంపింది. ఇప్పటివరకూ సుశాంత్ కేసులో ముంబై పోలీసులు నిజాయితీగా దర్యాప్తు చేశారని మహారాష్ట్ర సీఎంతో సహా ఆ రాష్ట్ర మంత్రులు, శరద్ పవార్ కూడా చెప్పిన నేపథ్యంలో ముంబై పోలీసులకు సీబీఐ సమన్లు పంపడం చర్చనీయాంశంగా మారింది.
ముంబై పోలీసులు కేసు నుంచి రియా చక్రవర్తిని ఉద్దేశపూర్వకంగా తప్పిస్తున్నారంటూ గతంలో కొన్ని వాదనలు కూడా తెరపైకొచ్చాయి. ఇప్పటికే సుశాంత్ కేసును దర్యాప్తు చేసిన బాంద్రా పోలీసుల నుంచి ఈ కేసుకు సంబంధించిన ఆధారలన్నింటినీ సీబీఐ ఇప్పటికే సేకరించింది.
Read more