రియా చక్రవర్తికి షాకిచ్చిన సీబీఐ..!

ABN , First Publish Date - 2020-08-07T02:48:03+05:30 IST

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతి కేసులో కీలక పరిణామం...

రియా చక్రవర్తికి షాకిచ్చిన సీబీఐ..!

పాట్నా: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సుశాంత్ కేసులో సీబీఐ దర్యాప్తునకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్ ఇవ్వడంతో కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో.. తాజాగా సీబీఐ రియా చక్రవర్తిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. రియాతో పాటు ఆమె కుటుంబ సభ్యులైన ఇంద్రజిత్ చక్రవర్తి, సంధ్య చక్రవర్తి, షోవిక్ చక్రవర్తిలపై సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. శామ్యూల్, శ్రుతి మోదీకి ఈ కేసుతో సంబంధమున్నట్టుగా వస్తున్న ఆరోపణల మేరకు సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. 


సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి అతని ఖాతా నుంచి రూ.15 కోట్లు అజ్ఞాత ఖాతాకు మళ్లించిందని సుశాంత్ తండ్రి బీహార్ పోలీసులుకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఆయన సీబీఐ విచారణకు డిమాండ్ చేయడంతో బీహార్ సీఎం నితీష్ కుమార్ సీబీఐ విచారణకు ప్రతిపాదన చేశారు. కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సీబీఐ విచారణ మొదలైంది. రియా ఆస్తులకు సంబంధించి ఒకపక్క ఈడీ కూడా ఆరా తీస్తోంది. సుశాంత్ కేసులో బీహార్ పోలీసులు విచారణకు దిగినప్పటి నుంచి రియా, ఆమె కుటుంబం అజ్ఞాతంలోనే ఉన్నారు. సీబీఐ తాజాగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంతో రియా సీబీఐ విచారణకు హాజరుకాక తప్పేలా లేదు.Updated Date - 2020-08-07T02:48:03+05:30 IST