వలస కార్మికుల కోసం కాల్‌ సెంటర్‌

ABN , First Publish Date - 2020-05-27T05:37:26+05:30 IST

‘కొవిడ్‌ -19’ కారణంగా గూడు చెదిరి, ఆదాయం కోల్పోయి వేరే దారి లేక తమ సొంత ఊళ్లకు చేరుకోవడానికి అనేక ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులను ఆదుకోవడానికి బాలీవుడ్‌ నటుడు సోనూ సూద్‌ చేపట్టిన...

వలస కార్మికుల కోసం కాల్‌ సెంటర్‌

‘కొవిడ్‌ -19’ కారణంగా గూడు చెదిరి, ఆదాయం కోల్పోయి వేరే దారి లేక తమ సొంత ఊళ్లకు చేరుకోవడానికి అనేక ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులను ఆదుకోవడానికి బాలీవుడ్‌ నటుడు సోనూ సూద్‌ చేపట్టిన చర్యలు ప్రతి ఒక్కరి ప్రశంసలు అందుకొంటున్నాయి. కర్నాటక, బీహార్‌, జార్ఖండ్‌, ఉత్తరప్రదేశ్‌కు చెందిన వలస కార్మికులను ఇప్పటివరకూ అనేక బస్సుల్లో  తరలించారు. ఇప్పుడు ఆయన ఓ అడుగు ముందుకు వేసి వలస కార్మికుల కోసం ప్రత్యేకంగా ఓ కాల్‌ సెంటర్‌ నెలకొల్పారు. ‘ప్రతి రోజూ మాకు వేలాది కాల్స్‌ వస్తున్నాయి.


మా కుటుంబ సభ్యులు, స్నేహితులు  వలస కార్మికుల నుంచి కాల్స్‌ రిసీవ్‌ చేసుకుంటూ వారికి సంబందించిన వివరాలు నోట్‌ చేసుకుంటున్నారు. అయితే నా నంబర్‌ తెలియని వారు కూడా ఇంకా ఎంతోమంది ఉన్నట్లు మా దృష్టికి వచ్చింది. అందుకే  అటువంటి వారికోసం ఓ కాల్‌ సెంటర్‌  నెలకొల్పి టోల్‌ ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేశాను. 18001213711 నంబర్‌కు వలస కార్మికులు ఫోన్‌ చేస్తే ఆదుకోవడానికి నేను, నా టీమ్‌ సిద్ధంగా ఉన్నాం. మేం ఎంతమందికి సాయం చేయగలమో తెలీదు కానీ వీలయినంత ఎక్కువ మంది వలస కార్మికులను వారి స్వస్థలాలకు చేర్చాలనే పట్టుదలతో కృషి చేస్తున్నాం’ అని తెలిపారు సోనూ సూద్‌. 

Updated Date - 2020-05-27T05:37:26+05:30 IST