షూటింగ్స్‌కు కేంద్రం అనుమతి.. సి. కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2020-08-25T04:04:21+05:30 IST
కరోనా కారణంగా సినిమా షూటింగ్‌లన్నీ ఆగిపోయాయి. థియేటర్స్ కూడా మూతపడ్డాయి. తాజాగా కేంద్రం కొన్ని నిబంధనలు విధిస్తూ.. షూటింగ్‌లకు అలాగే థియేటర్స్‌కు అనుమతి

కరోనా కారణంగా సినిమా షూటింగ్‌లన్నీ ఆగిపోయాయి. థియేటర్స్ కూడా మూతపడ్డాయి. తాజాగా కేంద్రం కొన్ని నిబంధనలు విధిస్తూ.. షూటింగ్‌లకు అలాగే థియేటర్స్‌కు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. షూటింగ్ లొకేషన్‌లో ఎవరెవరు ఎలా ఉండాలో చెబుతూ.. కొన్ని గైడ్‌లైన్స్‌ను కేంద్రం విడుదల చేసింది. అలాగే థియేటర్స్‌లో సిట్టింగ్ విషయంలో కూడా కొన్ని గైడ్‌లైన్స్‌ను ప్రకటించింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రం అనుమతులు ఇచ్చినా.. షూటింగ్స్ సాధ్యం కావని అన్నారు నిర్మాత సి. కల్యాణ్.
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గైడ్‌లైన్స్ ప్రకారం షూటింగ్స్ చేయడం కష్టమని.. సంచలన వ్యాఖ్యలు చేశారు సి. కల్యాణ్. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గైడ్‌లైన్స్ వల్ల ఎటువంటి ఉపయోగం లేదని, ఈ మహమ్మారికి వ్యాక్సిన్ వస్తేనే.. ధైర్యంగా నటీనటులు, సాంకేతిక నిపుణులు షూటింగ్స్‌కి వస్తారని, అప్పటి వరకు ఎవరూ బయటికి వచ్చే పరిస్థితి లేదని సి. కల్యాణ్ అన్నట్లుగా తెలుస్తుంది. వాస్తవానికి సి. కల్యాణ్ చెప్పింది అక్షరాలా నిజం. ఎందుకంటే ప్రజలందరూ భయాందోళనలో ఉన్నారు. కరోనా మహమ్మారి విషయంలో రికవరీ రేటు బాగున్నప్పటికీ.. కొందరు మరీ ధీనంగా చనిపోతున్నారు. ఏ ధైర్యం లేకుండా సినిమా వాళ్లు షూటింగ్‌లకు దిగడం కష్టమే. చూద్దాం.. ఏం జరుగుతుందో..?