నిర్మాతగా బీవీఎస్ రవి
ABN , First Publish Date - 2020-10-01T06:28:00+05:30 IST
రచయిత బీవీఎస్ రవి మరోసారి నిర్మాతగా మారుతున్నారు. గతంలో ‘సెకండ్ హ్యాండ్’ చిత్రాన్ని నిర్మించిన ఆయన, తాజాగా ‘మొగలి రేకులు’ సీరియల్ ఫేమ్ సాగర్ హీరోగా...

రచయిత బీవీఎస్ రవి మరోసారి నిర్మాతగా మారుతున్నారు. గతంలో ‘సెకండ్ హ్యాండ్’ చిత్రాన్ని నిర్మించిన ఆయన, తాజాగా ‘మొగలి రేకులు’ సీరియల్ ఫేమ్ సాగర్ హీరోగా ఓ యాక్షన్ థ్రిల్లర్ నిర్మించనున్నారు. ఈ చిత్రంతో గౌతమ్ మీనన్, వైవీఎస్ చౌదరి దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన రమేశ్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. ఇందులో కథానాయిక పాత్ర వైవిధ్యంగా ఉంటుందని, కొత్త తరహా కథాంశంతో చిత్రాన్ని రూపొందిస్తున్నామన్నారు నిర్మాత. కథ, కథనాలు కొత్తగా ఉంటాయన్నారు రాజేశ్.