మరో రికార్డ్: 300 మిలియన్ క్లబ్‌లోకి బుట్టబొమ్మ

ABN , First Publish Date - 2020-08-02T05:20:21+05:30 IST

కరోనా కష్టకాలంలో కూడా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు వరుసగా గుడ్ న్యూస్‌లు వింటున్నారు. ఆయన నటించిన ‘అల వైకుంఠపురములో’ చిత్రం ఎంత

మరో రికార్డ్: 300 మిలియన్ క్లబ్‌లోకి బుట్టబొమ్మ

కరోనా కష్టకాలంలో కూడా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు వరుసగా గుడ్ న్యూస్‌లు వింటున్నారు. ఆయన నటించిన ‘అల వైకుంఠపురములో’ చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్‌ అయిందో.. అంతకంటే ఎక్కువగా ఆ చిత్రంలోని ‘బుట్టబొమ్మ’ సాంగ్ హిట్టయింది. సినిమా విడుదలైనప్పటి నుంచి ‘బుట్టబొమ్మ’ సంచలనం తెలియంది కాదు. వ్యూస్, లైక్స్ అంటూ రోజూ ఏదో ఒక రికార్డ్ వార్త ఈ పాట గురించి వినిపిస్తూనే ఉంది. తాజాగా ఈ సాంగ్ 300 మిలియన్ ప్లస్ వ్యూస్ రాబట్టినట్లుగా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ తెలిపారు. 


ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్డ్రీకి సంబంధించి ఏ పాటకు ఇంత క్రేజ్ రాలేదు. టిక్ టాక్ వంటి మాధ్యమాలతో ఈ పాట అంతర్జాతీయ స్థాయిలో కూడా వినబడింది. థమన్ సంగీతం, రామజోగయ్య సాహిత్యానికి తోడు బన్నీ డ్యాన్స్, పూజా గ్లామర్ ఈ పాటకు ప్రధాన ఆకర్షణ అయ్యాయి. అందుకే యూట్యూబ్‌లో ఈ సాంగ్ విపరీతంగా క్రేజ్ అవుతోంది. ఇప్పుడీ పాట 300 మిలియన్ క్లబ్‌లోకి చేరి తెలుగు సినిమా స్థాయి ఏంటో మరోసారి చాటిచెప్పింది. 



Updated Date - 2020-08-02T05:20:21+05:30 IST