చిరకాల మిత్రుడికి బన్నీ విషెస్!

ABN , First Publish Date - 2020-10-08T14:18:12+05:30 IST

`ఈ రోజుల్లో` సినిమాతో సినీ పరిశ్రమలోకి ప్రవేశించి తనకంటూ సొంత గుర్తింపు సంపాదించుకున్నాడు డైరెక్టర్ మారుతి.

చిరకాల మిత్రుడికి బన్నీ విషెస్!

`ఈ రోజుల్లో` సినిమాతో సినీ పరిశ్రమలోకి ప్రవేశించి తనకంటూ సొంత గుర్తింపు సంపాదించుకున్నాడు డైరెక్టర్ మారుతి. ఆ తర్వాత వరుస విజయాలు అందుకుంటూ ప్రముఖ దర్శకుడిగా ఎదిగాడు. ఈ రోజు (గురువారం) మారుతి జన్మదినోత్సవం. ఈ సందర్భంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ట్విటర్ ద్వారా మారుతికి బర్త్ డే విషెస్ తెలియజేశాడు.


`నా చిరకాల మిత్రులలో ఒకడు, నా శ్రేయోభిలాషి, డైరెక్టర్ మారుతికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు` అని బన్నీ ట్వీట్ చేశాడు. మారుతి డైరెక్టర్ అవడాని కంటే ముందు నుంచి బన్నీకి స్నేహితుడు. బన్నీకి యానిమేషన్‌లో శిక్షణ కూడా ఇచ్చాడు. ఆ తర్వాత డైరెక్టర్‌గా మారి సొంత గుర్తింపు సంపాదించుకున్నాడు.   
Updated Date - 2020-10-08T14:18:12+05:30 IST