ఈ విషయంలో బన్నీదే టాప్ ప్లేస్

ABN , First Publish Date - 2020-06-08T05:09:14+05:30 IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘బాహుబలి’ చిత్రంతో టాలీవుడ్‌లో ఇప్పట్లో ఎవరూ తిరిగిరాయలేని రికార్డును తన పేరిట లిఖించుకున్నారు. ఆ చిత్రం తర్వాత అన్నీ నాన్ బాహుబలి

ఈ విషయంలో బన్నీదే టాప్ ప్లేస్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘బాహుబలి’ చిత్రంతో టాలీవుడ్‌లో ఇప్పట్లో ఎవరూ తిరిగిరాయలేని రికార్డును తన పేరిట లిఖించుకున్నారు. ఆ చిత్రం తర్వాత అన్నీ నాన్ బాహుబలి రికార్డులే కానీ.. ‘బాహుబలి’ని బీట్ చేసే చిత్రం ఇప్పటి వరకు ఒక్కటి కూడా రాలేదు. ఇక ఈ సంవత్సరం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అదిరిపోయే హిట్ కొట్టారు. ఆ హిట్ సౌండ్ ఇంకా వినబడుతూనే ఉంది. ‘అల వైకుంఠపురములో’ అంటూ వచ్చి నాన్ బాహుబలి రికార్డులన్ని తన పేరుమీదే రాసేసుకున్నాడు అల్లు అర్జున్. తాజాగా వీరిద్దరి పేర్లు సోషల్ మీడియాలో హైలెట్ అవుతున్నాయి. అది ఏ విషయంలో అంటే ఫేస్ బుక్ విషయంలో. 


ఫేస్ బుక్‌లో దక్షిణాది తారలలో అత్యధిక ఫాలోవర్స్ (14 మిలియన్స్) రికార్డ్ ప్రభాస్ నమోదు చేయగా, ఆ తర్వాత స్థానంలో అల్లు అర్జున్ ఉన్నారు. ఇక లైక్స్ విషయానికి వస్తే.. సౌత్‌లో టాప్‌ ప్లేస్ అల్లు అర్జున్ దే. అల్లు అర్జున్‌కు 13 మిలియన్స్ లైక్స్ రాగా, ప్రభాస్‌కు 10 మిలియన్ ప్లస్ లైక్స్ ఉన్నాయి. ఈ విషయంలో మరో దక్షిణాది తార ఎవరూ దరిదాపుల్లో లేకపోవడం విశేషం. ఈ విషయమే చెబుతూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

Updated Date - 2020-06-08T05:09:14+05:30 IST