ఫ్యామిలీ మెంబర్స్‌పై బన్నీ కామెంట్స్!

ABN , First Publish Date - 2020-12-08T00:19:32+05:30 IST

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి మొదలైంది.

ఫ్యామిలీ మెంబర్స్‌పై బన్నీ కామెంట్స్!

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి మొదలైంది. మెగా బ్రదర్ నాగాబాబు కూతురు నిహారిక మరో రెండ్రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కబోతోంది. ఉదయ్‌పూర్‌లోని ఉదయ్ విలాస్ హోటల్ వీరి వివాహానికి వేదిక కానుంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీకి చెందిన చాలా మంది అక్కడకు పయనమయ్యారు. 


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన తల్లిదండ్రులు, భార్యాపిల్లలతో కలిసి ప్రత్యేక విమానంలో బయల్దేరాడు. విమానంలో తీసుకున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఒక్కో ఫొటోనూ పోస్ట్ చేస్తూ ఆసక్తికర కామెంట్లు చేశాడు. తన ఫ్యామిలీ ఫొటోను షేర్ చేసి `ఎన్నో ఏళ్ల తర్వాత ఫ్యామిలీతో విమాన ప్రయాణం.. నిహారిక, చైతన్య పెళ్లి సంబరాలు షురూ` అని కామెంట్ చేశాడు. అలాగే తన భార్య స్నేహ ఫొటో షేర్ చేసి `క్యూటీ` అంటూ లవ్ సింబల్ ఎమోజీని పోస్ట్ చేశాడు. అలాగే `అల్లు దివా` అంటూ కూతురి ఫొటోను, `నాటీ` అంటూ కొడుకు ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. 

Updated Date - 2020-12-08T00:19:32+05:30 IST