అల్లు స్టూడియోస్‌కు రంగం సిద్ధం!

ABN , First Publish Date - 2020-10-01T20:09:52+05:30 IST

దిగ్గజ హాస్య నటుడు అల్లు రామలింగయ్య 99వ జయంతి సందర్భంగా అల్లు కుటుంబం ఓ కీలక ప్రకటన చేసింది.

అల్లు స్టూడియోస్‌కు రంగం సిద్ధం!

దిగ్గజ హాస్య నటుడు అల్లు రామలింగయ్య 99వ జయంతి సందర్భంగా అల్లు కుటుంబం ఓ కీలక ప్రకటన చేసింది. `అల్లు స్టూడియోస్` పేరుతో ఓ భారీ స్టూడియో నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. గండిపేటకు సమీపంలో ఈ స్టూడియోను భారీగా నిర్మించబోతున్నారు. 


అల్లు రామలింగయ్య 99వ జయంతి సందర్భంగా ఈ రోజు  (గురువారం) ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, అల్లు బాబీ పాల్గొన్నారు. సినిమా, టీవీ చిత్రీకరణలకు ఉపయోగపడేలా ఈ స్టూడియోను నిర్మించనున్నారు. త్వరలోనే పనులు ప్రారంభం కాబోతున్నాయని అల్లు అర్జున్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. 
Updated Date - 2020-10-01T20:09:52+05:30 IST