కత్తి మహేష్ అరెస్ట్‌తో ఆగిన మూవీ షూటింగ్

ABN , First Publish Date - 2020-08-14T22:58:40+05:30 IST

పాత్రికేయుడు, రచయిత, సినీ విమర్శకుడు, దర్శకుడు ప్రభు తాజాగా ‘రాంగ్ గోపాల్ వర్మ’ అనే చిత్రం రూపొందిస్తున్నారు. ప్రముఖ హాస్య కథానాయకుడు షకలక శంకర్ టైటిల్

కత్తి మహేష్ అరెస్ట్‌తో ఆగిన మూవీ షూటింగ్

పాత్రికేయుడు, రచయిత, సినీ విమర్శకుడు, దర్శకుడు ప్రభు తాజాగా ‘రాంగ్ గోపాల్ వర్మ’ అనే చిత్రం రూపొందిస్తున్నారు. ప్రముఖ హాస్య కథానాయకుడు షకలక శంకర్ టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో వివాదాస్పద విమర్శకుడు, నటుడు కత్తి మహేష్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం గత కొన్ని రోజులుగా సాగర్ సొసైటీలోని డి.ఎస్.రావు బిల్డింగ్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఓ మతాన్ని కించపరుస్తూ కత్తి మహేష్ సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో.. అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. 


దీంతో ‘రాంగ్ గోపాల్ వర్మ’ చిత్ర షూటింగ్‌కి అంతరాయం ఏర్పడింది. గత మూడు రోజులుగా కత్తి మహేష్, షకలక శంకర్‌లపై కొన్ని ముఖ్య సన్నివేశాలు దర్శకుడు ప్రభు చిత్రీకరిస్తున్నారు. ఓ ప్రముఖ దర్శకుడి విపరీత చేష్టలకు చెంప పెట్టుగా.. ప్రభు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పతాక సన్నివేశాలు, పాట మినహా ఈ చిత్రం షూటింగ్ దాదాపుగా పూర్తి చేసుకుందిని చిత్రయూనిట్ తెలిపింది.

Updated Date - 2020-08-14T22:58:40+05:30 IST