బ్రహ్మానందం గీసిన బొమ్మ

ABN , First Publish Date - 2020-04-20T13:53:59+05:30 IST

ప్ర‌స్తుతం కొన‌సాగుతోన్న‌ లాక్‌డౌన్‌లో ఆయ‌న ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు. షూటింగ్స్ వగైరాల‌న్నీ లేక‌పోవ‌డంతో ఆయ‌న త‌న‌లోని చిత్ర‌కారుడ్నినిద్ర లేపారు.

బ్రహ్మానందం గీసిన బొమ్మ

తెలుగు చిత్రసీమలో స్టార్ కమెడియన్ బ్ర‌హ్మానందం గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. వెయ్యికి పైగా సినిమాల్లో త‌న‌దైన న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను న‌వ్వించ‌డం ఆయ‌న‌కే చెల్లింది. ప్ర‌స్తుతం కొన‌సాగుతోన్న‌ లాక్‌డౌన్‌లో ఆయ‌న ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు. షూటింగ్స్ వగైరాలు లేక‌పోవ‌డంతో ఆయ‌న త‌న‌లోని చిత్ర‌కారుడ్నినిద్ర లేపారు. బ్ర‌హ్మానందం ఎంత‌గానో ఇష్ట‌ప‌డే ప్ర‌ముఖ ర‌చ‌యిత శ్రీశ్రీ ఫొటోను పెన్సిల్‌తో చిత్రీక‌రించారు. ఆ ఫొటోను బ్ర‌హ్మానందం త‌న‌యుడు, హీరో రాజా గౌత‌మ్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. బ్ర‌హ్మానందం ప్ర‌స్తుతం కృష్ణ‌వంశీ తెర‌కెక్కిస్తోన్న చిత్రం ‘రంగ‌మార్తాండ‌’లో కీల‌క పాత్ర‌ పోషిస్తున్నారు.

Updated Date - 2020-04-20T13:53:59+05:30 IST