లాక్‌డౌన్‌లో నాకు అలాంటి ఫీలింగ్ లేదు: బ్రహ్మానందం

ABN , First Publish Date - 2020-04-25T01:57:09+05:30 IST

కరోనా మహమ్మారి ప్రభావంతో దేశమంతా లాక్‌డౌన్‌లో ఉంది. లాక్‌డౌన్ ప్రారంభమై నెలరోజులు పూర్తయింది. అయినా కూడా కరోనా ఓ కొలిక్కి రాలేదు. రోజురోజుకి

లాక్‌డౌన్‌లో నాకు అలాంటి ఫీలింగ్ లేదు: బ్రహ్మానందం

కరోనా మహమ్మారి ప్రభావంతో దేశమంతా లాక్‌డౌన్‌లో ఉంది. లాక్‌డౌన్ ప్రారంభమై నెలరోజులు పూర్తయింది. అయినా కూడా కరోనా ఓ కొలిక్కి రాలేదు. రోజురోజుకి పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మరి ఇలాంటి సమయంలో సామాన్య జనం కాస్త ఇబ్బంది పడడం సహజమే. అయినా బయటికి వెళ్లి ప్రాణాల మీదికి తెచ్చుకునే కంటే.. ఇంటిలోనే ఫ్యామిలీతో గడపటం చాలా బెటర్ అనే స్థాయి ఇప్పుడిప్పుడే జనాల్లో అధికమవుతుంది. ఈ నేపథ్యంలో ఇలాంటి ప్రశ్నే హాస్య బ్రహ్మ బ్రహ్మానందంకు తాజా ఇంటర్వ్యూలో ఎదురైంది. దీనికి బ్రహ్మానందం ఏమని సమాధానం ఇచ్చారో తెలుసా?


‘‘నాకు లాక్‌డౌన్ అయినా, షూటింగ్స్ అయినా ఒకేలా ఉన్నాయి. ఎందుకంటే నేను షూటింగ్ లేకపోతే ఇంటిలోనే ఉంటాను. మళ్లీ బయటికి వెళితే అది షూటింగ్‌కే. నాకు వేరే వ్యాపకాలు ఏమీ లేవు. అందుకే వెళితే షూటింగ్.. లేదంటే ఇంట్లోనే. అందుకేనేమో నాకు ఈ లాక్‌డౌన్ సమయం బోర్ కొడుతుందే అనే ఫీలింగ్‌నే రానీయడం లేదు..’’ అని బ్రహ్మి తెలిపారు. 

Updated Date - 2020-04-25T01:57:09+05:30 IST