అది చేస్తే చనిపోయినా బ్రతికుంటాం: బ్రహ్మానందం

ABN , First Publish Date - 2020-10-01T23:25:03+05:30 IST

కామెడీ బ్రహ్మ బ్రహ్మానందం నేత్రదానం క్యాంపెయన్‌కు సపోర్ట్గ్‌గా నిలిచారు. కార్యా అంధత్వ ముక్త భార్గ్ అభియాన్‌ ద్వారా సాక్ష్యం సేవ

అది చేస్తే చనిపోయినా బ్రతికుంటాం: బ్రహ్మానందం

కామెడీ బ్రహ్మ బ్రహ్మానందం నేత్రదానం క్యాంపెయన్‌కు సపోర్ట్గ్‌గా నిలిచారు. కార్యా అంధత్వ ముక్త భార్గ్ అభియాన్‌ ద్వారా సాక్ష్యం సేవ ఆర్గనైజేషన్‌ చేస్తున్న నేత్రదాన అవగాహన కార్యక్రమంలో ఆయన కూడా భాగమయ్యారు. ప్రతి ఒక్కరూ నేత్రదానం చేయాలని ఆయన కోరారు. నేత్రదానం చేసి మరణించిన తర్వాత కూడా బతికుందామని ఆయన పిలుపునిచ్చారు. నేత్రదానం చేయడం వల్ల ఒక్కొక్కరు మరో ఇద్దరికి చూపుని ఇవ్వవచ్చని పేర్కొంటూ.. సాటివారికి ఉపయోగపడాలని ఆయన కోరారు.


ఇంకా ఆయన మాట్లాడుతూ.. ''సర్వేంద్రియానాం నయనం ప్రదానం అంటారు. అంటే అన్ని అవయువాల్లోకి నయనాలు చాలా ప్రదానమైనవని అర్థం. కళ్లతో చూడగలుగుతాం. కళ్లతో మాట్లాడగలుగుతాం. కళ్లతో మనలో కలిగే ప్రతి భావాన్ని వ్యక్తీకరించగలం. అనంత సృష్టిలో ఉన్న ప్రతిదానిని కళ్లతో చూసి ఆనందించగలిగేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక వరాన్ని భగవంతుడు మనకు ప్రసాదించాడు. మనం నేత్రదానం చేసినట్లయితే.. మరణించిన తర్వాత మన కళ్లు వృధా పోకుండా.. మనం ఇచ్చే రెండు కళ్లు నలుగురికి ఉపయోగపడతాయి. మనం మరణించిన తర్వాత కూడా బతికుండాలంటే మనం నేత్రదానం చేద్దాం. మన నేత్రదానం వల్ల అందరూ బాగుంటారు. కొంతైనా మనసుంటే మనం చచ్చిపోయినా బతికుంటాం. కాబట్టి మనసుతో ఆలోచించండి.  చనిపోయిన తర్వాత వ్యర్థ పదార్థం లాగా మట్టిలో కలిసిపోవడం కంటే.. మనలో ఉన్న అవయువాలు ఎవరికో ఒకరికి ఉపయోగపడతాయంటే.. అంతకంటే కావాల్సింది ఏముంటుంది?. ఎన్నో దానాలు చేస్తుంటూ ఉంటాం. ఎన్నో దానాలు చేశామని మనం చెప్పుకుంటూ ఉంటాం. గుండె ఒక్కటి ఉంటే చేయగలిగింది ఏమీ లేదు. 


కార్నియా అంధత్వ ముక్త భార్గ్ అభియాన్‌ ద్వారా సాక్ష్యం ఆర్గనైజేషన్‌ వాళ్లు కొన్ని అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ నేత్రదాన కార్యక్రమంలో ప్రతి విలేజ్‌కి.. ఇప్పటికే 350 విలేజెస్‌లో నేత్రదాన కార్యక్రమం నిర్వహిస్తూ.. కావాల్సిన నెట్‌ వర్క్ కూడా వాళ్లకి ఏర్పాటు చేస్తూ.. ఇంకా ఎంతో అభివృద్ది చేయాలనే ఆలోచన సాక్ష్యం ఆర్గనైజేషన్‌కు రావడం.. హ్యాట్సాఫ్‌. అలాంటి ఆలోచన కలిగి దానిని ప్రాక్టికల్‌గా కార్యరూపంలో పెట్టి.. ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని చేస్తున్న వారికి నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రతి వాళ్లు వారి ఆలోచనా విధానాన్ని మార్చుకుని.. నేత్రదానంకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మన సాటివాళ్లకి ఉపయోగపడదాం. వారికి కనుచూపునిద్దాం. వాళ్లు సృష్టిలో ఉన్నటువంటి జీవరాసులన్నింటిని, అందాలని చూసేటటువంటి అవకాశాన్ని కల్పిద్దాం. నేత్రదానం చేయండి. కళ్ళతో చూడగలిగే వారందరూ బాగుంటే మనమూ బాగుంటాం. మనం బాగుంటే.. దేశం బాగుంటుంది. సర్వేజనా సుఖినోభవంతు.." అని బ్రహ్మానందం పేర్కొన్నారు.

Updated Date - 2020-10-01T23:25:03+05:30 IST