సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ఎవరో కావాలని పుట్టించిన వార్త ఇది: బ్రహ్మానందం

ABN, First Publish Date - 2020-07-04T04:42:12+05:30

త్వరలో ఓ టీవీ సీరియల్‌లో నటించబోతున్నారనీ, కామెడీ షోలు చేయడానికి కూడా అంగీకరించారనీ అంటూ తన గురించి వస్తున్న వార్తల్ని హాస్యనటుడు బ్రహ్మానందం ఖండించారు. ఈ విషయం గురించి ఆయన ‘చిత్రజ్యోతి’తో....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

త్వరలో ఓ టీవీ సీరియల్‌లో నటించబోతున్నారనీ, కామెడీ షోలు చేయడానికి కూడా అంగీకరించారనీ అంటూ తన గురించి వస్తున్న వార్తల్ని హాస్యనటుడు బ్రహ్మానందం ఖండించారు. ఈ విషయం గురించి ఆయన ‘చిత్రజ్యోతి’తో మాట్లాడుతూ టీవీ సీరియల్స్‌లో నటించాలనే ఆలోచనే తనకు లేదని తెలిపారు. ‘చెప్పని మాటల్ని ఊహించేసుకొని ఎలా ప్రచారం చేస్తారో నాకు అర్ధం కావడం లేదు. ఎవరో కావాలనే పుట్టించిన వార్త ఇది. పొద్దుటినుంచీ ఒకటే ఫోన్లు. సమాధానం చెప్పలేకపోతున్నాను. వెబ్‌ సైట్స్‌లో, సోషల్‌ మీడియాలో ఇలా నా గురించి ప్రచారం చేయడం వల్ల నా లాభనష్టాల విషయం అలా పక్కన ఉంచి, అలా ప్రచారం చేసిన వారు నా పేరుతో ఓ రూపాయి సంపాదించుకొంటే అది నాకు ఆనందమే’ అన్నారు బ్రహ్మనందం.


తను ఇల్లు కదిలి మూడున్నర నెలలు అయిందనీ, లాక్‌డౌన్‌ సమయంలో ఇంట్లోనే సంతృప్తికరమైన  జీవితాన్ని గడుపుతున్నానని బ్రహ్మనందం చెప్పారు. ‘ఈ లాక్‌డౌన్‌ సమయంలో నండూరి రామ్మోహనరావుగారి ‘విశ్వదర్శనం’ సహా చక్కని పున్తకాలు చదివా. అలాగే ఖురాన్‌ మొత్తం ఆధ్యయనం చేశా.. ఆ పవిత్ర గ్రంధంలో ఏముంది, వాళ్ల మత సూక్తులు ఏమిటి, మహమ్మద్‌ ప్రవక్త ఏం చెప్పాడు.... ఇవన్నీ తెలుసుకున్నాను. ఆరవ తరగతి చదువుతున్న రోజులనుంచీ నాతో కలసి చదువుకొన్న ముస్లిమ్‌ మిత్రుడు ద్వారా ఇదంతా తెలుసుకొన్నాను. బైబిల్‌  లోని ఓల్డ్‌ టెస్ట్‌మెంట్‌, న్యూ టెస్ట్‌మెంట్‌ గురించి తెలుసుకొన్నాను. అలాగే బొమ్మలు వేయడం నాకు ఇష్టం కనుక ఈ తీరిక సమయాన్ని మంచి బొమ్మలు వేయడానికి ఉపయోగిస్తున్నా. ‘ఈ లాక్‌డౌన్‌ సమయంలో మీ కామెడీ సన్నివేశాలు చూస్తూ గడిపాం సార్‌’ అని ఎవరెవరో ఫోన్లు చేస్తుంటే సంతోషం కలుగుతోంది. ఇక మా ఇంటి మొత్తానికి మా మనవడు పార్థ ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పంచుతున్నాడు. వాడి అల్లరితో నాకు టైమ్‌ తెలియడం లేదు’’ అని అన్నారు బ్రహ్మానందం. 

Updated Date - 2020-07-04T04:42:12+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!