లాక్‌డౌన్ పొడిగిస్తే మాకు చిప్పే గతి: బ్రహ్మాజీ

ABN , First Publish Date - 2020-05-14T15:36:24+05:30 IST

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న కారణంగా దేశవ్యాప్తంగా ప్రజలందరూ గత 50 రోజులుగా ఇళ్లకే పరిమితమయ్యారు.

లాక్‌డౌన్ పొడిగిస్తే మాకు చిప్పే గతి: బ్రహ్మాజీ

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న కారణంగా దేశవ్యాప్తంగా ప్రజలందరూ గత 50 రోజులుగా ఇళ్లకే పరిమితమయ్యారు. జీతాలు కట్ చేయడం వల్ల మధ్యతరగతి వారు, పనుల్లేకపోవడం వల్ల పేదవారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 


పేదలు, మధ్యతరగతి వాళ్లే కాదు.. లాక్‌డౌన్ ఇంకా పొడిగిస్తే తమ పరిస్థితి కూడా అంతేనంటూ సినీ నటుడు బ్రహ్మాజీ సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నాడు. `లాక్‌డౌన్ ఇంకా పొడిగిస్తే మా పరిస్థితి ఇది..` అంటూ ఓ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. చేతిలో చిప్ప పట్టుకుని కూర్చుని ఉన్న బ్రహ్మాజీ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫొటో చూసి కొందరు సరదాగా స్పందిస్తుండగా, మరికొందరు తమ కష్టాలు చెప్పుకుంటున్నారు. 
Updated Date - 2020-05-14T15:36:24+05:30 IST