అతణ్ని తొక్కేయకుంటే మనకే డేంజర్: బ్రహ్మాజీ

ABN , First Publish Date - 2020-08-07T16:52:30+05:30 IST

నటుడు సుహాస్ వెరీ ట్యాలెంటెడ్ అని, అతణ్ని తొక్కేయకుంటే మనకే డేంజర్ అని నటుడు బ్రహ్మాజీ ట్వీట్ చేశారు

అతణ్ని తొక్కేయకుంటే మనకే డేంజర్: బ్రహ్మాజీ

నటుడు సుహాస్ వెరీ ట్యాలెంటెడ్ అని, అతణ్ని తొక్కేయకుంటే మనకే డేంజర్ అని నటుడు బ్రహ్మాజీ ట్వీట్ చేశారు. `కలర్ ఫొటో` సినిమా ద్వారా కమెడియన్ సుహాస్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా టీజర్‌లో సుహాస్ నటనను ప్రశంసిస్తూ బ్రహ్మాజీ ఇలా కామెంట్ చేశారు. 


ఇటీవల ఈ సినిమా టీజర్ విడుదలైంది. ఇందులోని సన్నివేశాలు, సుహాస్ నటన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ టీజర్ చూసిన ప్రముఖ కమెడియన్ వెన్నెల కిషోర్ ట్విటర్ ద్వారా ప్రశంసించాడు. సుహాస్ ఫైర్ మీదున్నాడని పేర్కొన్నాడు. ఈ ట్వీట్‌కు స్పందించిన బ్రహ్మాజీ.. `అన్నీ బాగున్నాయ్ కాకా.. ఈ సుహాస్‌ని తొక్కేయాలి. అతనిలో చాలా టాలెంట్ ఉంది.. లేకపోతే మనకే డేంజర్` అంటూ ఫన్నీగా స్పందించారు. `కలర్ ఫొటో` సినిమాలో సునీల్ విలన్‌గా కనిపిస్తున్నాడు. 
Updated Date - 2020-08-07T16:52:30+05:30 IST