అమృతకు అబ్బాయి

ABN , First Publish Date - 2020-11-03T10:22:51+05:30 IST

కథానాయిక అమృతారావు ఆదివారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఆమె భర్ట, ఆర్జే అన్‌మోల్‌ చాలా సంతోషంగా...

అమృతకు అబ్బాయి

కథానాయిక అమృతారావు ఆదివారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఆమె భర్ట, ఆర్జే అన్‌మోల్‌ చాలా సంతోషంగా సోమవారం ఈ సంగతి సోషల్‌ మీడియాలో వెల్లడించారు. తల్లీబిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. తమ కుటుంబంపై ఎంతో ప్రేమ, అభిమానాలు కురిపిస్తున్న ప్రేక్షకులకు అన్‌మోల్‌ కృతజ్ఞతలు తెలిపారు. ప్రేమాభిమానాలను ఆశీర్వాదంగా భావిస్తున్నామన్నారు. పిల్లాడికి ఏం పేరు పెడితే బావుంటుందో సూచించమని నెటిజన్లను ఆయన కోరారు. తెలుగులో మహేశ్‌బాబు సరసన ‘అతిథి’ చిత్రంలో అమృత నటించిన సంగతి తెలిసిందే.

Updated Date - 2020-11-03T10:22:51+05:30 IST