దిలీప్ కుమార్ సోదరులకు కరోనా పాజిటివ్

ABN , First Publish Date - 2020-08-17T01:36:57+05:30 IST

బాలీవుడ్ వెటరన్ నటుడు దిలీప్ కుమార్ సోదరులు ఎహెసాన్ ఖాన్, అస్లాం ఖాన్‌లు కరోనా బారిన పడ్డారు. వీరిద్దరి వయసు 80 వరకు ఉండడంతో...

దిలీప్ కుమార్ సోదరులకు కరోనా పాజిటివ్

ముంబై: బాలీవుడ్ వెటరన్ నటుడు దిలీప్ కుమార్ సోదరులు ఎహెసాన్ ఖాన్, అస్లాం ఖాన్‌లు కరోనా బారిన పడ్డారు. వీరిద్దరి వయసు 80 వరకు ఉండడంతో ప్రస్తుతం కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరినీ స్థానిక లీలావతి ఆసుపత్రిలో చేర్పించారు. ఇద్దరినీ వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. అంతేకాకుండా ఇద్దరి రక్తంలోనూ ఆక్సిజన్ పంపిణీ 94 కంటే తక్కువగా ఉందని, జ్వరం, దగ్గుతో కూడా బాధపడుతున్నారని తెలిపారు.

Updated Date - 2020-08-17T01:36:57+05:30 IST