బాండ్ సినిమా మళ్లీ వాయిదా
ABN , First Publish Date - 2020-10-05T07:57:57+05:30 IST
బాండ్ సినిమా ‘నో టైమ్ టూ డై’ విడుదల మరోసారి వాయిదాపడింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 2న సినిమాను విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. జేమ్స్‌బాండ్..

బాండ్ సినిమా ‘నో టైమ్ టూ డై’ విడుదల మరోసారి వాయిదాపడింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 2న సినిమాను విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. జేమ్స్‌బాండ్ సిరీ్‌సలో వస్తోన్న 25వ చిత్రమిది. ఏప్రిల్‌లో విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా వల్ల ఆగిపోయింది. ఆ తర్వాత నవంబర్‌లో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు వచ్చే ఏడాది ఏప్రిల్ 2కు విడుదల వాయిదా పడింది. ‘‘కరోనా వల్ల కొన్ని దేశాల్లో థియేటర్లు ఇంకా మూతపడే ఉన్నాయి. బాండ్ అభిమానులకు ఇది బాధ కలిగించే విషయమే అయినా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని నిర్మాతలు తెలిపారు.
Read more