న్యూ ఇయర్ డే రోజు ‘బొమ్మ అదిరింది.. దిమ్మ తిరిగింది’
ABN , First Publish Date - 2020-12-25T03:40:15+05:30 IST
షకలక శంకర్ హీరోగా ఈ మధ్య వరుస సినిమాలను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఒకవైపు సినిమాలను పూర్తి చేస్తూనే.. కొత్త సినిమాలకు శంకర్ కమిట్ అవుతున్నారు. ప్రస్తుతం

షకలక శంకర్ హీరోగా ఈ మధ్య వరుస సినిమాలను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఒకవైపు సినిమాలను పూర్తి చేస్తూనే.. కొత్త సినిమాలకు శంకర్ కమిట్ అవుతున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన చిత్రం ఒకటి విడుదలకు సిద్ధమైంది. కుమార్ కోట దర్శకత్వంలో ఆయన హీరోగా రూపొందిన చిత్రం 'బొమ్మ అదిరింది.. దిమ్మ తిరిగింది'. ఔట్ అండ్ ఔట్ సస్పెన్స్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్ ఇటీవల విడుదలై మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే.
షకలక శంకర్ కామెడీ టైమింగ్ ప్రధానాకర్షణ తెరకెక్కిన ఈ చిత్రాన్ని మహాంకాళి మూవీస్, మణిదీప్ ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థలపై మధు లుకాలపు, సోమేష్ ముచ్చర్ల నిర్మించారు. షకలక శంకర్‌తో పాటు ప్రియ, అర్జున్ కళ్యాణ్, హీన, అవంతిక, రితికా చక్రవర్తి, రాజ్ స్వరూప్, మధు, సంజన చౌదరి ఇతర ప్రధాన పాత్రలు పోషించిన ఈ సస్పెన్స్ కామెడీ చిత్రాన్ని జనవరి 1న విడుదల చేయబోతున్నట్లుగా నిర్మాతలు ప్రకటించారు. న్యూ ఇయర్‌లో అందరినీ అలరిస్తుందని వారు తెలిపారు.