హీరో సూర్య ఆఫీస్‌కి బాంబు బెదిరింపులు

ABN , First Publish Date - 2020-09-29T00:47:48+05:30 IST

ఈ మ‌ధ్యకాలంలో స్టార్ హీరోల‌కు బాంబు బెదిరింపులు స‌ర్వ‌సాధార‌ణంగా మారిపోయాయి. ఇదేంటి? ఇలా అంటున్నారే! అని అనుకుంటున్నారా.. కానీ కోలీవుడ్ హీరోలకు జ‌రుగుతున్న విష‌యాలు చూస్తుంటే అలానే అనిపిస్తున్నాయి.

హీరో సూర్య ఆఫీస్‌కి బాంబు బెదిరింపులు

ఈ మ‌ధ్యకాలంలో స్టార్ హీరోల‌కు బాంబు బెదిరింపులు స‌ర్వ‌సాధార‌ణంగా మారిపోయాయి. ఇదేంటి? ఇలా అంటున్నారే! అని అనుకుంటున్నారా.. కానీ కోలీవుడ్ హీరోలకు జ‌రుగుతున్న విష‌యాలు చూస్తుంటే అలానే అనిపిస్తున్నాయి. ఇటీవ‌ల కాలంలో సూప‌ర్‌స్టార్ రజినీకాంత్‌, అజిత్‌, మ‌ణిర‌త్నం, స్టార్ హీరో విజ‌య్ త‌దిత‌రుల ఇళ్లు, ఆఫీసుల్లో బాంబులు పెట్టామంటూ పోలీసుల‌కు ఫోన్స్ వ‌చ్చాయి. పోలీసులేమో హూటాహుటిన స‌ద‌రు స్టార్స్ ఇళ్లు, ఆఫీసుల‌ను చెక్ చేసి.. బాంబు ఏమీ లేద‌ని, వ‌చ్చిన ఫోన్ కాల్ ఫేక్ అని నిర్దారించుకోవ‌డం జ‌రిగాయి. ఇప్పుడు అలాంటి మ‌రో ఫేక్ కాల్ మ‌రోసారి పోలీసుల‌కు ప‌ని పెట్టింది. వివ‌రాల్లోకెళ్తే..చెన్నై అల్వార్‌పేట ప్రాంతంలోని హీరో సూర్య ఆఫీసులో బాంబు పెట్టిన‌ట్లు పోలీసుల‌కు ఫోన్ రావ‌డంతో, వెళ్లి చెక్ చేశారు. తీరా అక్క‌డ బాంబు లేద‌ని, వ‌చ్చింది ఫేక్ కాల్ అని తెలిశాక పోలీసులు తిరుగుముఖం ప‌ట్టారు. 

Updated Date - 2020-09-29T00:47:48+05:30 IST