హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు

ABN , First Publish Date - 2020-07-19T18:00:19+05:30 IST

హీరో అజిత్ పేరు మీద రావ‌డంతో పోలీసులు అజిత్ ఇంట్లో రెండు గంట‌ల పాటు సోదాలు నిర్వ‌హించి ఫేక్ కాల్ అని తేల్చారు.

హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు

త‌మిళ స్టార్ హీరోల‌కు వ‌రుస బాంబు బెదిరింపులు వ‌స్తున్నాయి. ఇటీవ‌ల కాలంలో సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్‌, హీరో విజ‌య్ ఇళ్ల‌లో బాంబు పెట్టామ‌ని అజ్ఞాత వ్య‌క్తులు ఫోన్ చేయ‌డంతో పోలీసులు అప్ర‌మ‌త్తమై సోదాలు నిర్వ‌హించి చివ‌ర‌కు అవి ఫేక్ కాల్స్ అని తేల్చిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు అలాంటి బాంబు బెదిరింపు ఫోన్ కాల్‌.. హీరో అజిత్ పేరు మీద రావ‌డంతో పోలీసులు అజిత్ ఇంట్లో రెండు గంట‌ల పాటు సోదాలు నిర్వ‌హించి ఫేక్ కాల్ అని తేల్చారు. ఆ ఫోన్ విలుపురం నుండి వ‌చ్చింద‌ని పోలీసులు క‌నుగొన్నారు. త్వ‌ర‌లోనే ఫోన్ చేసిన వ్య‌క్తిని కూడా ప‌ట్టుకుంటామ‌ని వారు తెలిపారు. 

Updated Date - 2020-07-19T18:00:19+05:30 IST