బ్రేకింగ్ న్యూస్: బాలీవుడ్‌లో తిరుగుబాటు మొదలైంది
ABN , First Publish Date - 2020-10-12T23:37:30+05:30 IST
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి తర్వాత బాలీవుడ్‌లో ఎటువంటి వాతావరణం నెలకొందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా నెపోటిజం అంటూ

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి తర్వాత బాలీవుడ్‌లో ఎటువంటి వాతావరణం నెలకొందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా నెపోటిజం అంటూ మొదలై.. డ్రగ్స్ వైపుకు దారితీసింది. మధ్యలో పాయల్ ఘోష్ ఓ టాప్ దర్శకుడి మీద చేసిన ఆరోపణలతో.. మరింతగా బాలీవుడ్ వేడెక్కింది. అయితే ఇంత జరుగుతున్నా.. ఒక్క అక్షయ్ కుమార్ తప్ప.. వేరే ఎవరూ నోరు మెదపలేదు. అంతా ఇక బాలీవుడ్ పని అయిపోయినట్లే అనుకుంటున్న తరుణంలో.. బాలీవుడ్‌లో తిరుగుబాటు మొదలైనట్లుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా తరుణ్ ఆదర్శ్ బ్రేకింగ్ అంటూ చేసిన ట్వీట్ చూస్తుంటే.. నిజంగానే పడిపోతున్న బాలీవుడ్ పేరును నిలబెట్టేందుకు బాలీవుడ్ ప్రముఖులందరూ ఇప్పుడు మేల్కొన్నారా? అని అనిపించకమానదు.
బాలీవుడ్‌లోని నాలుగు అసోషియేషన్స్, 34 బడా నిర్మాణ సంస్థలు బాలీవుడ్‌పై దుమ్మెత్తిపోస్తున్న మీడియా సంస్థలను నివేదించడానికి దావా వేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. అయితే ఇప్పటి వరకు నోరు మెదపకుండా ఉన్న వీరంతా.. ఒక్కసారిగా మూకుమ్మడిగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక ఏదైనా కారణం ఉందా? లేదంటే నిజంగానే బాలీవుడ్‌ను పరిరక్షించేందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా? నిజంగా బాలీవుడ్ పేరు నిలబెట్టేందుకే అయితే.. ముందు వారు టార్గెట్ చేయాల్సింది మీడియా హౌస్‌లను కాదు.. మీడియాలో వార్తలుగా మారి, బాలీవుడ్ పరువు తీస్తున్న వారిపై దృష్టి పెట్టాలి. మరి ఆ దిశగా వీరు మున్ముందు అడుగులు వేస్తారేమో చూద్దాం.

