బ‌న్నీ డాన్స్‌కు ఫిదా అయిన బాలీవుడ్ స్టార్‌

ABN , First Publish Date - 2020-05-13T18:37:25+05:30 IST

టాలీవుడ్‌లో డాన్సుల‌కు క్రేజ్ తీసుకొచ్చింది మెగాస్టార్ చిరంజీవి. ఆయ‌న త‌ర్వాత నేటి త‌రం హీరోల్లో చాలా మంది డాన్సుల్లో ఇర‌గ‌దీస్తున్నారు. అయితే బ‌న్నీ డాన్సుల‌కు చాలా మంచి క్రేజ్ ద‌క్కుతుంది.

బ‌న్నీ డాన్స్‌కు ఫిదా అయిన బాలీవుడ్ స్టార్‌

టాలీవుడ్‌లో డాన్సుల‌కు క్రేజ్ తీసుకొచ్చింది మెగాస్టార్ చిరంజీవి. ఆయ‌న త‌ర్వాత నేటి త‌రం హీరోల్లో చాలా మంది డాన్సుల్లో ఇర‌గ‌దీస్తున్నారు. అయితే బ‌న్నీ డాన్సుల‌కు చాలా మంచి క్రేజ్ ద‌క్కుతుంది. అందుకు ఉదాహ‌ర‌ణ ఆయ‌న న‌టించిన తాజా చిత్రం ‘అల వైకుంఠ‌పురములో’ డాన్సులే. ఈ సినిమాలో ‘బుట్ట‌బొమ్మ’, ‘రాములో రాముల’ సాంగ్స్‌కు బాలీవుడ్ సెల‌బ్రిటీలు, వార్న‌ర్‌, పీట‌ర్స‌న్ వంటి క్రికెట‌ర్స్ టిక్‌టాక్ వీడియోలు చేసేస్తున్నారు. ఇప్పుడు మ‌రో బాలీవుడ్ స్టార్ కూడా అల్లు అర్జున్ డాన్స్‌లకు తాను పెద్ద అభిమానినని తెలిపాడు. ఆ బాలీవుడ్ స్టార్ ఎవ‌రో కాదు.. షాహిద్ క‌పూర్‌. ‘క‌బీర్‌సింగ్’ చిత్రంతో సెన్సేష‌న‌ల్ హిట్ అందుకున్న షాహిద్ సోష‌ల్ మీడియాలో అభిమానుల‌తో మాట్లాడుతున్న‌ప్పుడు ఓ అభిమాని అల్లు అర్జున్ గురించి ఓ మాట‌లో చెప్పండి అని ప్ర‌శ్నించిన‌ప్పుడు ‘నేను త‌న డాన్సింగ్ స్కిల్స్‌ను ఇష్ట‌ప‌డ‌తాను’ అని షాహిద్ స‌మాధానమివ్వడం విశేషం. 

Updated Date - 2020-05-13T18:37:25+05:30 IST