ఈ దృశ్యం ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేను: ప‌్ర‌ముఖ ద‌ర్శ‌కుడు

ABN , First Publish Date - 2020-05-04T16:43:34+05:30 IST

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమ‌లవుతున్న విష‌యం విదిత‌మే. ఈ నేప‌ధ్యంలో ఢిల్లీ, ముంబై త‌దిత ప్రాంతాల‌కు చెందిన కార్మికులు కాలినడకన వారి ఇళ్లకు వెళుతున్నారు.

ఈ దృశ్యం ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేను: ప‌్ర‌ముఖ ద‌ర్శ‌కుడు

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమ‌లవుతున్న విష‌యం విదిత‌మే. ఈ నేప‌ధ్యంలో ఢిల్లీ, ముంబై త‌దిత ప్రాంతాల‌కు చెందిన కార్మికులు కాలినడకన వారి ఇళ్లకు వెళుతున్నారు. ఈ విష‌య‌మై బాలీవుడ్ దర్శకుడు అనుభవ్ సిన్హా ట్వీట్ చేశారు. ఇది వైర‌ల్‌గా మారింది.... ఈ మ‌హిళ త‌న కుమార్తెను ఎత్తుకుని హైవేపై ఎంత‌దూరం వెళుతుందో... ఈ దృశ్యాన్ని ఎన్నేళ్ల‌యినా మ‌ర‌చిపోలేను అని తన ట్వీట్‌లో అనుభవ్ సిన్హా రాశారు. ఈ ట్వీట్‌పై ఆయ‌న అభిమానులు త‌మ స్పంద‌న తెలియ‌జేస్తున్నారు.  అనుభవ్ సిన్హా తన అభిప్రాయాలను త‌ర‌చూ సోషల్ మీడియాలో పంచుకుంటుంటారు. 

Updated Date - 2020-05-04T16:43:34+05:30 IST