స్టంట్ మెన్‌లకు విద్యుత్ జమ్వాల్ ఆర్థిక సాయం

ABN , First Publish Date - 2020-08-14T22:35:22+05:30 IST

బాలీవుడ్ స్టంట్ ఆర్టిస్ట్‌లకు నటుడు విద్యుత్ జమ్వాల్ ఆర్థిక సహాయాన్ని అందించాడు. కరోనా సమయంలో వారు కనీస అవసరాలకు కూడా ఇబ్బంది..

స్టంట్ మెన్‌లకు విద్యుత్ జమ్వాల్ ఆర్థిక సాయం

ముంబై: బాలీవుడ్ స్టంట్ ఆర్టిస్ట్‌లకు నటుడు విద్యుత్ జమ్వాల్ ఆర్థిక సహాయాన్ని అందించాడు. కరోనా సమయంలో వారు కనీస అవసరాలకు కూడా ఇబ్బంది పడుతున్నారని, ఆర్థికంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నాడు. దీంతో వారికి తనవంతుగా చేయూతనందిస్తున్నట్లు చెప్పాడు. దీని కోసం కొంత మొత్తాన్ని స్టంట్ ఆర్టిస్ట్ అస్సోసియేషన్‌కు అందజేసినట్లు తెలిపాడు. అయితే ఇండస్ట్రీలోని ఇతర నటీనటులు కూడా వారికి సాయం చేసేందుకు ముందుకురావాలని పిలుపునిచ్చాడు. తద్వారా స్టంట్ ఆర్టిస్ట్‌ల కుటుంబాలు ఆర్థిక కష్టాల నుంచి కొంత మేర బయటపడగలుగుతాయని అభిప్రాయపడ్డాడు.

Updated Date - 2020-08-14T22:35:22+05:30 IST