బాలీవుడ్ నటుడు భూపేష్ పాండ్యా కేన్సరుతో కన్నుమూత

ABN , First Publish Date - 2020-09-24T11:54:19+05:30 IST

బాలీవుడ్ నటుడు భూపేష్ పాండ్యా ఊపిరితిత్తుల కేన్సరుతో కన్నుమూశారు....

బాలీవుడ్ నటుడు భూపేష్ పాండ్యా కేన్సరుతో కన్నుమూత

ముంబై : బాలీవుడ్ నటుడు భూపేష్ పాండ్యా ఊపిరితిత్తుల కేన్సరుతో కన్నుమూశారు. నేషనల్ స్కూలు ఆఫ్ డ్రామా పూర్వ విద్యార్థి అయిన బూపేష్ పాండ్యా గత కొంత కాలంగా ఊపిరితిత్తుల కేన్సరుతో బాధపడుతున్నారు. ఆయుష్మాన్ ఖుర్రానా తొలిచిత్రం ‘విక్కీ  డోనర్’ తో మంచి పేరు తెచ్చుకున్న బాలీవుడ్ నటుడు భూపేష్ పాండ్యా మృతి పట్ల బాలీవుడ్ నటులు ప్రగాఢ సంతాపం తెలిపారు. భూపేష్ పాండ్యా 4వ దశ ఊపిరితిత్తుల కేన్సరుతో బాధపడుతుండటంతో అతనికి చికిత్స చేయించేందుకు నటులు మనోజ్ బాయ్ పేయి, గజరాజ్ రావు, రాజేష్ తైలాంగ్ లు గతంలో నిధులు సేకరించారు.భూపేష్ పాండ్యా హజరోన్ ఖ్వాహిషెయిన్ ఐసీ, వెబ్ సిరీస్, ఢిల్లీ క్రైం, గాంధీ టు హిట్లర్, ద స్టోరీ ఆఫ్ పోఖ్రాన్ వంటి ప్రాజెక్టుల్లో పనిచేశారు. 

Updated Date - 2020-09-24T11:54:19+05:30 IST