అనుమానాస్పద స్థితిలో మరణించిన బాలీవుడ్ సీనియర్ నటుడు

ABN , First Publish Date - 2020-11-13T00:42:25+05:30 IST

బాలీవుడ్ సీనియర్ నటుడు అసిఫ్ బస్రా (53) అనుమానాస్పద స్థితిలో మరణించారు. హిమాచల్‌ప్రదేశ్‌, ధర్మశాలలోని ఓ ప్రైవేటు కాంప్లెక్స్‌లో

అనుమానాస్పద స్థితిలో మరణించిన బాలీవుడ్ సీనియర్ నటుడు

ధర్మశాల: బాలీవుడ్ సీనియర్ నటుడు అసిఫ్ బస్రా (53) అనుమానాస్పద స్థితిలో మరణించారు. హిమాచల్‌ప్రదేశ్‌, ధర్మశాలలోని ఓ ప్రైవేటు కాంప్లెక్స్‌లో ఉరివేసుకున్న స్థితిలో కనిపించినట్టు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. తన పెంపుడు కుక్కును కట్టేందుకు ఉపయోగించే గొలుసునే ఉరి కోసం వాడినట్టు పోలీసులు గుర్తించారు. పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించిట్టు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఆయన మృతి వెనక ఉన్న కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 


బస్రా పలు బాలీవుడ్ సినిమాల్లో కేరెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించారు. ఇందులో ‘జబ్ వియ్ మెట్’, ‘ఏక్ విలన్’, ‘ఫన్నీ ఖాన్’, ‘రాయ్’, ‘హిచ్‌కీ’ వంటి హిట్ సినిమాలు ఉన్నాయి. అలాగే, పలు వెబ్ షోలలోనూ నటించారు. అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ‘పాతాళ్ లోక్’లోనూ ఆయన నటించి మెప్పించారు.  


Updated Date - 2020-11-13T00:42:25+05:30 IST