న్యూయార్క్‌లో అయోధ్య రామాలయం ఫోటోలపై అక్షయ్ ఏమన్నారంటే..

ABN , First Publish Date - 2020-08-07T03:45:42+05:30 IST

అయోధ్యలోని రామజన్మభూమిలో నిర్మిస్తున్న రామాలయ భూమి పూజ బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది. భారత్‌లో ఈ వేడుక జరుగుతున్న నేపథ్యంలో...

న్యూయార్క్‌లో అయోధ్య రామాలయం ఫోటోలపై అక్షయ్ ఏమన్నారంటే..

ముంబై: అయోధ్యలోని రామజన్మభూమిలో నిర్మిస్తున్న రామాలయ భూమి పూజ బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది. భారత్‌లో ఈ వేడుక జరుగుతున్న నేపథ్యంలో అమెరికాలో ఓ గొప్ప సంఘటన చోటు చేసుకుంది. న్యూయార్క్‌‌ సిటీలోని టైమ్ స్క్వేర్‌ వద్ద డిజిటల్ డిస్‌ప్లేలలో రాముడితో పాటు అయోధ్య ఆలయ చిత్రాలు ప్రదర్శితమయ్యాయి. ఈ విధంగా పాశ్చాత్య దేశంలోనూ అయోధ్యకు ప్రాధాన్యం లభించడంపై బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు తన ట్విటర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. ‘ఇది కచ్చితంగా చారిత్రక క్షణం. నా వరకు దీపావళి ముందుగానే వచ్చినట్లు ఉంది. జై శ్రీరాం’ అంటూ ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం అయోధ్య రామాలయ భూమి పూజ నిర్వహించారు. ఆలయ పునాది రాయిని ప్రతిష్ఠించారు.



Updated Date - 2020-08-07T03:45:42+05:30 IST