ఒకటో తేదీన బోగన్
ABN , First Publish Date - 2020-12-21T07:08:12+05:30 IST
అరవింద్ స్వామి, జయం రవి, హన్సిక కాంబినేషన్‌లో విజయం సాధించిన తమిళ చిత్రం ‘బోగన్’ అదే పేరుతో తెలుగులో అనువాదం అయింది...

అరవింద్ స్వామి, జయం రవి, హన్సిక కాంబినేషన్‌లో విజయం సాధించిన తమిళ చిత్రం ‘బోగన్’ అదే పేరుతో తెలుగులో అనువాదం అయింది. లక్ష్మణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రామ్ తాళ్లూరి కొత్త సంవత్సరం కానుకగా జనవరి ఒకటో తేదిన విడుదల చేస్తున్నారు. ‘తని ఒరువన్’ తర్వాత ‘జయం’ రవి, అరవింద్ స్వామి కాంబినేషన్‌లో రూపొందిన చిత్రమిది. అదే స్థాయిలో సినిమా విజయం సాధిస్తుందని నిర్మాత తెలిపారు. నాజర్, పొన్‌వణ్ణన్, నరేన్, నాగేంద్రప్రసాద్, వరుణ్, అక్షర గౌడ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంభాషణలు: రాజేష్ ఎ. మూర్తి, సాహిత్యం: భువనచంద్ర, సంగీతం: డి. ఇమ్మాన్, సినిమాటోగ్రఫీ: సౌందర్ రాజన్.
Read more