‘నల్ల గులాబీ’ వస్తోంది!

ABN , First Publish Date - 2020-08-19T05:42:45+05:30 IST

మిస్‌ ఇండియా ఊర్వశీ రౌతేలా కథానాయికగా శ్రీనివాసా సిల్వర్‌ స్ర్కీన్‌ సంస్థ నిర్మిస్తున్న చిత్రం ‘బ్లాక్‌ రోజ్‌’. షేక్స్‌ పియర్‌ రచించిన ‘ద మర్చంట్‌ ఆఫ్‌ వెనీస్‌’లో షైలాక్‌ పాత్ర...

‘నల్ల గులాబీ’ వస్తోంది!

మిస్‌ ఇండియా ఊర్వశీ రౌతేలా కథానాయికగా శ్రీనివాసా సిల్వర్‌ స్ర్కీన్‌ సంస్థ నిర్మిస్తున్న చిత్రం ‘బ్లాక్‌ రోజ్‌’. షేక్స్‌ పియర్‌ రచించిన ‘ద మర్చంట్‌ ఆఫ్‌ వెనీస్‌’లో షైలాక్‌ పాత్ర ఆధారంగా చేసుకుని ఫిమేల్‌ ఓరియంటెడ్‌ సినిమాగా రీ క్రియేట్‌ చేస్తున్నారు సంపత్‌ నంది. మోహన్‌ భరద్వాజ్‌ ఈ చిత్రానికి దర్శకుడు. శ్రీనివాసా చిట్టూరి తెలుగు, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు. సోమవారం రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలైంది. సంపత్‌ నంది మాట్లాడుతూ ‘‘ఫిమేల్‌ ఓరియంటెడ్‌ ఎమోషనల్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. ‘విచక్షణరహిత, యోగ్యత లేని ఆర్థిక లావాదేవీలు మరణానికి సంకేతం’ అనే కౌటిల్యుడి అర్థశాస్త్రంలోని కాన్సెప్ట్‌ను జోడించి తెరకెక్కిస్తున్నాం’’ అని అన్నారు. ‘‘ఊర్వశీ రౌతేలాకు తెలుగులో ఎన్ని అవకాశాలు వచ్చినా ప్రత్యేక ఆసక్తితో ఈ సినిమా చేస్తున్నారు. కరోనా కారణంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సింగిల్‌ షెడ్యూల్‌లో సినిమాను పూర్తి చేయాలనుకుంటున్నాం’’ అని నిర్మాత చెప్పారు. ఈ చిత్రానికి సమర్పణ: పవన్‌ కుమార్‌, డిఓపి: సౌందర్‌ రాజన్‌, సంగీతం: మణిశర్మ. 

Updated Date - 2020-08-19T05:42:45+05:30 IST