మల్లీ.. అల్లాడించేద్దాం: కార్తికేయ

ABN , First Publish Date - 2020-12-15T18:31:34+05:30 IST

`అందాల రాక్షసి` సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన క్యూట్ బ్యూటీ లావణ్యా త్రిపాఠి

మల్లీ.. అల్లాడించేద్దాం: కార్తికేయ

`అందాల రాక్షసి` సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన క్యూట్ బ్యూటీ లావణ్యా త్రిపాఠి ఈ రోజు (మంగళవారం) 30వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటోంది. ప్రస్తుతం ఈమె యువ హీరో కార్తికేయ గుమ్మకొండ సరసన `చావు కబురు చల్లగా` సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో లావణ్య `మల్లిక` పాత్రలో కనిపించబోతోంది. 


లావణ్య పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్త పోస్టర్ ని తాజాగా విడుదల చేసింది. ఆ పోస్టర్‌ను షేర్ చేసిన హీరో కార్తికేయ.. `మల్లీ.. ఈ రోజు నీ హ్యాపీ బర్త్ డే అంటగా.. చెప్పనేలేదు.. నువ్వు అట్టాగే ఉండు.. సాయంత్రం మన బ్యాచ్‌ని అట్టుకొత్తా.. అల్లాడించేద్దాం అంతే` అని ట్వీట్ చేశాడు. Updated Date - 2020-12-15T18:31:34+05:30 IST

Read more