`బిగ్‌బాస్-4` కంటెస్టెంట్స్‌కు జాక్‌పాట్!

ABN , First Publish Date - 2020-12-29T20:12:35+05:30 IST

`బిగ్‌బాస్-4`.. చాలా మంది కథలను మార్చింది.

`బిగ్‌బాస్-4` కంటెస్టెంట్స్‌కు జాక్‌పాట్!

`బిగ్‌బాస్-4`.. చాలా మంది కథలను మార్చింది. గతంలో జరిగిన మూడు సీజన్లు ఒకెత్తు.. ఈ సీజన్ ఒకటీ మరో ఎత్తు. ఈ సీజన్‌లో పాల్గొన్న కంటెస్టెంట్లు గుర్తింపును మాత్రమే కాదు.. మంచి అవకాశాలను కూడా దక్కించుకుంటున్నారు. ఈ సీజన్‌లో మూడో స్థానంలో నిలిచిన సొహైల్.. హౌస్ నుంచి బయటకు రాగానే ఓ సినిమా ఛాన్స్ దక్కించుకున్నాడు. సొహైల్ సినిమాలో నటిస్తామని మెగాస్టార్ చిరంజీవి, బ్రహ్మానందం స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. 


టాప్ ఫైవ్ జాబితాలో చోటు సంపాదించుకోలేకపోయిన హీరోయిన్ మోనాల్.. బెల్లంకొండ శ్రీనివాస్ `అల్లుడు అదుర్స్` సినిమాలో ఐటెం సాంగ్ ఛాన్స్ సంపాదించిందట. అలాగే, మరో కంటెస్టెంట్ దివి తన తర్వాతి సినిమాలో నటించబోతోందని మెగాస్టార్ స్వయంగా చెప్పారు. ఇక, `ఆచార్య` సినిమాలో మెహబూబ్‌కు ఓ పాత్ర దక్కిందని తాజా సమాచారం. ఇక, `బిగ్‌బాస్-4` విన్నర్‌ అభిజిత్‌కు తాజాగా ఓ బంపరాఫర్ వచ్చిందట. వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌ హీరోలుగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న `ఎఫ్3`లో ఓ పాత్రకు అభిజిత్‌ను తీసుకున్నారట. 


Updated Date - 2020-12-29T20:12:35+05:30 IST