సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

బిగ్‌బాస్‌4 కొట్టాడయ్యా.. అతి పెద్ద రికార్డ్

ABN, First Publish Date - 2021-01-01T01:26:52+05:30

తెలుగు బుల్లితెరపై అతి పెద్ద రియాలిటీ షోగా సాగిపోతోన్న బిగ్‌బాస్‌.. రీసెంట్‌గానే సీజన్‌ 4ను కంప్లీట్‌ చేసుకుంది. డిసెంబర్‌ 20న జరిగిన ఫైనల్‌లో బిగ్‌బాస్‌ 4 విన్నర్‌గా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలుగు బుల్లితెరపై అతి పెద్ద రియాలిటీ షోగా సాగిపోతోన్న బిగ్‌బాస్‌.. రీసెంట్‌గానే సీజన్‌ 4ను కంప్లీట్‌ చేసుకుంది. డిసెంబర్‌ 20న జరిగిన ఫైనల్‌లో బిగ్‌బాస్‌ 4 విన్నర్‌గా హీరో అభిజిత్‌ నిలవగా.. రన్నర్‌గా అఖిల్‌ నిలిచారు. సొహైల్‌ మూడవ స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఇక ఈ షోని పలు ఎంటర్‌టైన్‌మెంట్‌ కార్యక్రమాలతో డిజైన్‌ చేసిన విషయం తెలిసిందే. చివర్లో మెగా ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్‌ చిరంజీవి.. షోని ఓ రేంజ్‌కి తీసుకెళ్లారు. చిరు-నాగ్‌ల కాంబో ఈ షోని నడిపిన తీరు అందరినీ అలరించిందనడంలో అతిశయోక్తి ఉండదు. అందుకే ఇండియా వైడ్‌గా ఇప్పటి వరకు జరిగిన అన్ని బిగ్‌బాస్‌ ఫైనల్‌ ఎపిసోడ్స్‌ను బీట్‌ చేసి.. రికార్డు స్థాయిలో 21.7 టీఆర్పీ రేటింగ్‌ను ఈ ఫైనల్‌ ఎపిసోడ్‌ సాధించినట్లుగా అధికారికంగా ఈ షోని నిర్వహించిన స్టార్‌ మా ప్రకటించింది.


వాస్తవానికి ఈ షో మొదట చాలా చెత్త టాక్‌ని సొంతం చేసుకుంది. ఒక్క వీకెండ్‌ మినహా.. ప్రేక్షకులను ఈ షో అలరించలేకపోయిందనే టాక్‌ నడిచింది. కంటెస్టెంట్‌ల విషయంలో కూడా అందరూ పెదవి విరిచారు. కరోనా కారణంగా ఇంటికే పరిమితమైన వారంతా ఈ షోని ఆదరించి పెద్ద హిట్‌ చేస్తారని భావిస్తే.. మరీ దారుణమైన రేటింగ్‌తో సదరు ఛానెల్‌ వారిని ఆలోచనలో పడేసేలా చేసిందీ షో అనేలా సోషల్‌ మీడియాలో కూడా టాక్‌ నడిచింది. మరి అలాంటి టాక్‌ నడిచిన.. ఈ షో.. ఫైనల్‌ ఎపిసోడ్‌ ఇంత పెద్ద హిట్‌ అవ్వడం పట్ల.. ఇప్పుడంతా హ్యాపీగా ఉన్నారు. ఈ ఆనందంలో త్వరలోనే సీజన్‌5ను కూడా ప్రకటన చేయనున్నారనేలా వార్తలు నడుస్తున్నాయి.


ఇక ఈ ఫైనల్‌ ఎపిసోడ్‌కి వచ్చిన రికార్డ్‌ టీఆర్పీతో కింగ్‌ నాగ్‌ కూడా తన సంతోషాన్ని సోషల్‌ మీడియా వేదికగా తెలియజేశారు. ''వావ్‌.. మీ ప్రేమకు ధన్యవాదాలు. మీరంతా ఆదరించకపోతే ఈ ఫైనల్‌ ఎపిసోడ్‌ ఇంత పెద్ద సక్సెస్‌ అయ్యేది కాదు. ఈ సందర్భంగా ప్రేక్షకులకు, కంటెస్టెంట్‌లకు, బిగ్‌బాస్‌ యాజమాన్యానికి, చిరంజీవిగారికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను..'' అని కింగ్‌ నాగ్‌ ట్వీట్‌ చేశారు. 



Updated Date - 2021-01-01T01:26:52+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!