సీక్రెట్‌ మెయిన్‌టెయిన్‌ చేయలేకపోతున్న బిగ్‌బాస్‌...తగ్గుతున్న క్రేజ్‌

ABN , First Publish Date - 2020-09-28T15:59:56+05:30 IST

బిగ్‌బాస్‌ రియాలిటీ షోస్‌లో నాలుగో సీజన్‌ రన్‌ అవుతోంది. గత మూడు సీజన్స్‌ కంటే ఈ సీజన్‌పై వీక్షకులు పెద్దగా ఆసక్తిని చూపడం లేదు. అందుకు కారణాలున్నాయంటున్నారు బిగ్‌బాస్‌ ప్రేమికులు.

సీక్రెట్‌ మెయిన్‌టెయిన్‌ చేయలేకపోతున్న బిగ్‌బాస్‌...తగ్గుతున్న క్రేజ్‌

బిగ్‌బాస్‌ రియాలిటీ షోస్‌లో నాలుగో సీజన్‌ రన్‌ అవుతోంది. గత మూడు సీజన్స్‌ కంటే ఈ సీజన్‌పై వీక్షకులు పెద్దగా ఆసక్తిని చూపడం లేదు. అందుకు కారణాలున్నాయంటున్నారు బిగ్‌బాస్‌ ప్రేమికులు. బలమైన కంటెస్టెంట్స్‌ లేకపోవడం, కంటెస్టెంట్స్‌ మధ్య గ్లేమ్‌ ప్లానింగ్‌ సరిగా లేకపోవడం అని చెబుతూ వచ్చిన ఆడియెన్స్‌ఇప్పుడు మరో కారణంగానూ బిగ్‌బాస్‌ 4పై ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గిపోతుందంటున్నారు. అదేంటంటే బిగ్‌బాస్‌ షోలో సీక్రెసీ లేకపోవడమేనట. ఇంతకూ బిగ్‌బాస్ ఏ విషయంలో సీక్రెట్‌ మెయిన్‌టెయిన్‌ చేయలేకపోతున్నారంటే.. ఎలిమినేటర్స్‌ విషయంలోనని అంటున్నారు బిగ్‌బాస్‌ వ్యూయర్స్‌. గత సీజన్స్‌లోనూ కొన్ని ఎలిమినేటర్స్‌ విషయం లీకులైయాయి. కానీ అవి కొన్ని గంటల ముందే తెలిసేవి. కానీ నాలుగో సీజన్‌లో ఎలిమినేటర్‌ ఎవరనే విషయం రెండు రోజుల ముందే తెలిసిపోతుంది. ఇప్పటి వరకు బిగ్‌బాస్‌ 4లో సూర్యకిరణ్‌, కళ్యాణి, దేవీ నాగవల్లీ ఎలిమినేషన్స్‌ జరిగాయి. అయితే ఆదివారం జరిగే ఈ ఎలిమినేషన్స్‌ గురించి శుక్రవారం రోజునే న్యూస్‌ లీకవుతుంది. రెండు రోజుల ముందు విషయం బయటకు పొక్కుతుండటంతో..కిక్‌ లేకుండా పోతుందని టీవీ ఆడియెన్స్‌ భావిస్తున్నారట. మరిప్పుడు బిగ్‌బాస్‌ ఏం చేస్తారో చూడాలి. 


Updated Date - 2020-09-28T15:59:56+05:30 IST