పెళ్లి పీటలెక్కిన `బిగ్‌బాస్` సామ్రాట్!
ABN , First Publish Date - 2020-11-05T15:04:27+05:30 IST
నటుడు, `బిగ్‌బాస్` సీజన్ 2 కంటెస్టెంట్ సామ్రాట్ రెడ్డి పెళ్లి పీటలు ఎక్కాడు.

నటుడు, `బిగ్‌బాస్` సీజన్ 2 కంటెస్టెంట్ సామ్రాట్ రెడ్డి పెళ్లి పీటలు ఎక్కాడు. కాకినాడలో జరిగిన వివాహ వేడుకలో శ్రీలిఖితను వివాహం చేసుకున్నాడు. సామ్రాట్‌కు ఇది ద్వితీయ వివాహం. మొదటి భార్యకు విడాకులు ఇచ్చి తాజాగా రెండో పెళ్లి చేసుకున్నాడు.
కరోనా కారణంగా సామ్రాట్ పెళ్లి నిరాడంబరంగా అతి తక్కువ మంది అతిథుల సమక్షంలో జరిగింది. పెళ్లికి సంబంధించిన ఫొటోలను సామ్రాట్ సోదరి, మోడల్ శిల్పారెడ్డి సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. సామ్రాట్ వివాహానికి తనీష్, దీప్తీ సునైన వంటి `బిగ్‌బాస్` పార్టిసిపెంట్లు కూడా హాజరయ్యారు.