నా బాయ్‌ఫ్రెండ్ పెద్ద మోసగాడు... బిగ్‌బాస్ మాజీ పోటీదారు,ప్రముఖ సినీనటి వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2020-02-14T14:43:26+05:30 IST

బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్‌, ప్రముఖ సినీనటి సనాఖాన్, తన ప్రియుడైన కొరియోగ్రాఫర్ మెల్విన్ లూయిస్‌లు విడిపోయారు.....

నా బాయ్‌ఫ్రెండ్ పెద్ద మోసగాడు... బిగ్‌బాస్ మాజీ పోటీదారు,ప్రముఖ సినీనటి వ్యాఖ్యలు

ముంబై:  బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్‌, ప్రముఖ సినీనటి సనాఖాన్, తన ప్రియుడైన కొరియోగ్రాఫర్ మెల్విన్ లూయిస్‌లు విడిపోయారు. తన బాయ్ ఫ్రెండ్‌తో డేటింగ్‌కు గుడ్ బై చెప్పిన సనాఖాన్ మొదటిసారి తన ప్రియుడి బాగోతాల గురించి బయటపెట్టారు. మెల్విన్ లూయిస్ చాలామంది మహిళలను మోసగించాడని, అతను మోసగాడు అని సనాఖాన్ ఆరోపించారు. వాస్తవం చెప్పడానికి ధైర్యం కావాలని, మెల్విన్‌ను తాను గుడ్డిగా నమ్మానని, కాని అతను పెద్ద మోసగాడని తెలుసుకున్నానని సనా వ్యాఖ్యానించారు. మెల్విన్ నన్ను వివాహం చేసుకొని పిల్లలు కనాలని కోరుకున్నాడు, కానీ అమ్మాయిలను మోసం చేసే మెల్విన్ కు కుమారుడు, కుమార్తెలు పుడితే వారికి ఏం నేర్పుతాడు అని సనా ప్రశ్నించారు.

Updated Date - 2020-02-14T14:43:26+05:30 IST