గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో బిగ్‌బాస్‌ 4 విన్నర్‌

ABN , First Publish Date - 2020-12-22T22:27:42+05:30 IST

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్. పేరుకి ఇది ఛాలెంజే‌.. కానీ ప్రతి ఒక్కరూ ఇది తమ కర్తవ్యంగా భావిస్తూ.. ఇందులో భాగమవుతున్నారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో బిగ్‌బాస్‌ 4 విన్నర్‌

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్. పేరుకి ఇది ఛాలెంజే‌.. కానీ ప్రతి ఒక్కరూ ఇది తమ కర్తవ్యంగా భావిస్తూ.. ఇందులో భాగమవుతున్నారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌.. ఇప్పుడు మహాఉద్యమంలా మారి.. ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తోంది. రీసెంట్‌గా బాలీవుడ్‌ స్టార్‌ నటీనటులు సంజయ్‌ దత్‌, అజయ్‌ దేవగణ్‌ వంటి వారందరూ ఈ ఉద్యమంలో భాగమై.. మొక్కలు నాటారు. టాలీవుడ్‌ సెలబ్రిటీల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి ఎందరిలోనో స్పూర్తి నింపారు. తాజాగా ఈ ఉద్యమంలో భాగమయ్యారు.. బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 4 విజేత అభిజిత్‌. 


ఈ ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటిన అభిజిత్ మాట్లాడుతూ.. ''ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. బిగ్ బాస్ 4 రియాల్టీ షో విజేతగా నిలిచిన సందర్భంగా ఏదైనా మంచి కార్యక్రమం చేయాలి అనుకుంటున్న నాకు.. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్‌గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటాలని అనిపించింది. ఈరోజు (మంగళవారం) మొక్కలు నాటడం జరిగింది. ఇంత మంచి కార్యక్రమం చేపట్టి ముందుకు తీసుకుపోతున్న సంతోష్‌గారికి కృతజ్ఞతలు. పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యాన్ని మనందరం నియంత్రించలంటే.. అందుకోసం ప్రతి ఒక్కరి బాధ్యతగా మొక్కలు నాటాలి. ఈ సందర్భంగా నాతో పాటు బిగ్ బాస్ షోలో పాల్గొన్న సొహైల్‌, హారిక, కళ్యాణిలను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని కోరుతున్నాను.." అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు చెందిన రాఘవ, కిషోర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-22T22:27:42+05:30 IST