బిగ్‌బాస్‌ 4 విశేషాలివే..!

ABN , First Publish Date - 2020-09-07T15:24:01+05:30 IST

తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్‌ 4 ఆదివారం సాయంత్రం అట్టహాసంగా ప్రారంభమైంది.

బిగ్‌బాస్‌ 4 విశేషాలివే..!

తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్‌ 4 ఆదివారం సాయంత్రం అట్టహాసంగా ప్రారంభమైంది. కరోనా వైరస్ ప్రభావం ఇంకా తగ్గుముఖం పట్టని ప్రస్తుత పరస్థితుల్లో బిగ్‌బాస్‌ సీజన్‌ 4ను ఎలా ప్రారభిస్తారు? ఎవరు హోస్ట్‌ చేస్తారు? అనే సందేహాలు ప్రారంభ దశలో చాలానే వచ్చాయి. అయితే నిర్వాహకులు ఓ ప్లాన్ ప్రకారం బిగ్‌బాస్‌ను స్టార్ట్‌ చేశారు. ముందుగా 16 మంది కంటెస్టెంట్స్‌ను ఓకే చేసిన తర్వాత వారిని 16 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచి బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఎంట్రీ చేశారు. అలాగే హోస్ట్‌ నాగార్జున సైతం పదహారు రోజుల పాటు హోం క్వారంటైన్‌లోనే ఉండి కార్యక్రమాన్ని ప్రారంభించారు.


నాగ్‌... డ్యూయెల్‌ రోల్‌

బిగ్‌బాస్‌ మూడో సీజన్‌ను సక్సెస్‌ చేసిన అక్కినేని నాగార్జున వైపే నిర్వాహకులు ఈసారి మొగ్గు చూపారు. అయితే గత మూడు షోలకు భిన్నంగా ఈసారి హోస్టింగ్‌ను డ్యూయెల్‌ రోల్‌లో హోస్ట్‌ చేయడం విశేషం. తండ్రీ, కొడుకులుగా నాగార్జున ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కొడుకు పాత్రలోని నాగార్జున హోస్ట్‌ చేస్తుంటే.. తండ్రి పాత్రలోని నాగార్జున గెస్ట్‌గా బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. గతసారి బిగ్‌బాస్‌ హౌస్‌లకంటే ఈసారి బిగ్‌బాస్‌ హౌస్‌ పెద్దదిగా ఉంది. రెగ్యులర్‌ రూమ్స్‌ కంటే ఓ స్పెషల్‌ రూమ్‌ కూడా ఇందులో ఉండటం విశేషం. అదేంటో తెలుసుకోవాలంటే వెయిటింగ్ తప్పదని నాగ్‌ అన్నారు. 


బిగ్‌బాస్‌ హౌస్‌లోకి కంటెస్టెంట్స్‌ ఎంట్రీ తర్వాత హౌస్‌ను లాక్‌ చేసిన నాగ్‌.. 15 వారాల ఎంటర్‌టైన్మెంట్‌ ఉంటుందని, 16వ వారం విజేతను ప్రకటిస్తామని చెప్పారు. 


Updated Date - 2020-09-07T15:24:01+05:30 IST