బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ప్రముఖ యూట్యూబర్... మరింత ఆసక్తికరంగా షో

ABN , First Publish Date - 2020-09-16T17:17:17+05:30 IST

బిగ్‌బాస్-14(హిందీ) త్వరలో టీవీ ప్రేక్షకులను అలరించనుంది. దీంతో ఈ సీజన్ బిగ్‌బాస్‌లో ఎవరెవరు పాల్గొనబోతున్నారనే దానిపై ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి నెలకొంది. బిగ్‌బాస్‌లో పాల్గొనబోయేది వీరేనంటూ కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి.

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ప్రముఖ యూట్యూబర్... మరింత ఆసక్తికరంగా షో

బిగ్‌బాస్-14(హిందీ) త్వరలో టీవీ ప్రేక్షకులను అలరించనుంది. దీంతో ఈ సీజన్ బిగ్‌బాస్‌లో ఎవరెవరు పాల్గొనబోతున్నారనే దానిపై ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి నెలకొంది. బిగ్‌బాస్‌లో పాల్గొనబోయేది వీరేనంటూ కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఫైనలిస్టుల పేర్లు ఇంకా వెల్లడికాలేదు. అయితే తాజాగా ప్రముఖ యూట్యూబర్ అజయ్ నాగర్ బిగ్ బాస్‌లో పోటీదారుగా ఉండబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. 


అజయ్ ప్రస్తుతం ముంబైలో క్వారంటైన్‌లో ఉన్నారు. ఈ గడువు పూర్తయ్యాక అజయ్ బిగ్‌బాస్ హౌస్‌లో కాలు మోపనున్నారని సమాచారం. అయితే అధికారికంగా దీనిపై ఎటువంటి ప్రకటన వెలువడలేదు. కాగా హిందీ బిగ్ బాస్ షో షూటింగ్ అక్టోబరు 1 నుంచి ముంబైలోని ఫిల్మ్ సిటీలో ప్రారంభం కానుంది. అక్టోబరు 3 నుంచి ఈ షో ప్రసారం కానుంది. ఈ సీజన్‌లో షోను మరింత ఆసక్తికరంగా తీర్చిదిద్దేందుకు నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. 


Updated Date - 2020-09-16T17:17:17+05:30 IST