బిగ్‌బాసూ... షూటింగు!

ABN , First Publish Date - 2020-08-02T05:54:11+05:30 IST

బాసూ... అక్కినేని నాగార్జున మళ్లీ మేకప్‌ వేసుకున్నారు! షూటింగు చేశారు! అయితే, ఇది సినిమా షూటింగు కాదు. రియాలిటీ షో ‘బిగ్‌ బాస్‌’ నాలుగో సీజన్‌ ప్రచార చిత్రాల కోసం చిత్రీకరణలో పాల్గొన్నారు...

బిగ్‌బాసూ... షూటింగు!

బాసూ... అక్కినేని నాగార్జున మళ్లీ మేకప్‌ వేసుకున్నారు! షూటింగు చేశారు! అయితే, ఇది సినిమా షూటింగు కాదు. రియాలిటీ షో ‘బిగ్‌ బాస్‌’ నాలుగో సీజన్‌ ప్రచార చిత్రాల కోసం చిత్రీకరణలో పాల్గొన్నారు. కరోనా నేపథ్యంలో చిత్రీకరణలకు విరామం పలికిన ప్రస్తుత పరిస్థితులలో, మార్చి తర్వాత మళ్ళీ నాగార్జున సెట్స్‌కు రావడం ఇదే. మధ్యలో కరోనా వైరస్‌పై యుద్ధం చేద్దామని కోటి స్వరపరిచిన ప్రేరణ గీతంలో కనిపించినప్పటికీ... ఇంట్లోనే షూటింగ్‌ చేసి వీడియో పంపారు. ఇప్పుడు సెట్స్‌కి వచ్చారు. కొవిడ్‌ నియమ నిబంధనలు పాటిస్తూ చిత్రీకరణ చేశారు. మేకప్‌మ్యాన్‌, హెయిర్‌ డ్రస్సర్‌ పీపీఈ కిట్లు ధరించి తనను చిత్రీకరణకు సిద్ధం చేస్తున్న సమయంలో తీసిన ఫొటోను సామాజిక మాధ్యమాలలో నాగార్జున పంచుకున్నారు. ‘‘సెట్స్‌ మీదకు మళ్లీ వచ్చేశా. లైట్స్‌, కెమెరా, యాక్షన్‌... నిజంగా ఓ అద్భుతం’’ అని నాగార్జున పేర్కొన్నారు.

Updated Date - 2020-08-02T05:54:11+05:30 IST