శ్రద్ధాదాస్‌కు ‘బిగ్’ ఆఫర్..

ABN , First Publish Date - 2020-05-26T03:03:11+05:30 IST

మంచి అవకాశం రావడానికి కొంతమందికి జీవితకాలం పడుతుంది. ఇంకొంతమందికి ఆ వచ్చిన అవకాశాన్ని విజయంగా మలుచుకోవడానికి అంతే కష్టం

శ్రద్ధాదాస్‌కు ‘బిగ్’ ఆఫర్..

మంచి అవకాశం రావడానికి కొంతమందికి జీవితకాలం పడుతుంది. ఇంకొంతమందికి ఆ వచ్చిన అవకాశాన్ని విజయంగా మలుచుకోవడానికి అంతే కష్టం అవుతుంది. ఇందులో రెండవ కోవకి చెందిన ఓ హాట్ బ్యూటీకి ఇప్పుడు బుల్లితెర నుంచి బిగ్ ఆఫర్ వచ్చిందట. అభినయంతో కన్నా అందాల ప్రదర్శనతో ఎక్కువ పేరు సంపాదించుకున్న హీరోయిన్ శ్రద్ధాదాస్. ఈ క్రేజ్‌తోనే శ్రద్ధా తెలుగులో పలు చిత్రాలలో నటించింది. అయినా ఈ బెంగాలీ బ్యూటీ టాలీవుడ్‌లో స్టార్ స్టేటస్ అందుకోలేకపోయింది. వరుస పరాజయాలతో రేసులో వెనుకబడ్డ శ్రద్ధా.. సౌత్ టు నార్త్ చక్కర్లు కొట్టినా ఎక్కడా టాప్ లీగ్‌లో స్థానం దక్కించుకోలేకపోయింది. తాజాగా ఈ హాటీకి తెలుగు ‘బిగ్ బాస్’ నుండి పిలుపు వచ్చిందట. 


రియాలిటీ షో అంటే తెలియని తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు అందులోని మజాని పరిచయం చేసిన ప్రోగ్రాం ‘బిగ్ బాస్’. తెలుగునాట ఇప్పటి వరకు ఈ షో మూడు సీజన్స్ పూర్తి చేసుకుంది. ఇప్పుడు నాలుగో సీజన్ కోసం నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగా బిగ్ బాస్ యాజమాన్యం శ్రద్ధాను బిగ్ బాస్ 4 లో పాల్గొనాల్సిందిగా కోరారట. దీనికి భారీ రెమ్యూనరేషన్ కూడా ఆఫర్ చేశారట. ప్రస్తుతం చేతిలో అంతగా అవకాశాలు లేకపోవడంతో శ్రద్ధా కూడా ఈ ఆఫర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. పరిశ్రమలో శ్రద్ధాదాస్ శ్రద్దగా చేసిన అందాల ప్రదర్శనే ఆమె కెరీర్‌ని ఇబ్బందుల్లోకి నెట్టిందనే టాక్ ఉంది. 


ఈ బ్యూటీ స్కిన్ షోను ఆడియన్స్ బాగానే ఆశ్వాదించినా ఈమెపై గ్లామర్ డాల్ ముద్ర పడింది. దీనితో శ్రద్ధాదాస్ నటనకు అవకాశం ఉన్న పాత్రలు దక్కించుకోలేకపోయింది. శ్రద్ధా ప్రస్తుతం ‘కోటిగొబ్బ 3’ అనే కన్నడ చిత్రంతో పాటు, ‘నిరీక్షణ’ అనే తెలుగు సినిమాలో నటిస్తుంది. మరి బిగ్ బాస్ 4 లో అలరించడానికి సిద్దమైన శ్రద్ధాదాస్ ఈ రియాలిటీ షో ద్వారా ఎలాంటి క్రేజ్ సొంతం చేసుకుంటుందో చూద్దాం.

Updated Date - 2020-05-26T03:03:11+05:30 IST