బండ్ల గణేష్‌లో ఈ మార్పు గమనించారా!

ABN , First Publish Date - 2020-07-27T01:11:12+05:30 IST

బండ్ల గణేష్.. ఈ పేరు ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తుంది. సినిమాలు తీయడం మానేసిన తర్వాత ఆయన పేరు రాజకీయంగా కొన్ని రోజులు వినిపించింది. ఆ తర్వాత ‘సరిలేరు నీకెవ్వరు’

బండ్ల గణేష్‌లో ఈ మార్పు గమనించారా!

బండ్ల గణేష్.. ఈ పేరు ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తుంది. సినిమాలు తీయడం మానేసిన తర్వాత ఆయన పేరు రాజకీయంగా కొన్ని రోజులు వినిపించింది. ఆ తర్వాత ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్న సమయంలో వినిపించింది. ఆ తర్వాత మళ్లీ ‘గబ్బర్‌సింగ్’ విషయంలో దర్శకుడు హరీష్ శంకర్ తన పేరు ప్రస్తావించలేదని ఆయనపై హాట్ హాట్ కామెంట్స్ చేసి వార్తలలో నిలిచాడు. ఆ తర్వాత కరోనా పాజిటివ్. ప్రస్తుతం నెగిటివ్. కరోనా నుంచి కోలుకున్నాక కూడా ఆయన ‘సరిలేరు నీకెవ్వరు’లో చేసిన పాత్రపై సంచలనంగా మాట్లాడి వార్తలలో నిలిచారు. అయితే కరోనా నుంచి కోలుకున్నాక మాత్రం బండ్ల గణేష్‌లో భారీ మార్పు గమనిస్తుంది. అందుకు నిదర్శనం తాజాగా ఆయన చేసిన ట్వీటే.


కరోనా నుంచి కోలుకున్నాక మరో జన్మ ఎత్తినెట్టినట్లుగా భావిస్తున్న బండ్ల గణేష్‌లో అంతకు ముందు ఉన్నటువంటి స్పీడ్, యాటిట్యూడ్ కనిపించడం లేదు. చాలా సౌమ్యంగా మాట్లాడుతున్నాడు. నలుగురికి సహాయం చేయాలి అన్నట్లుగా ఇప్పుడాయన నడుస్తున్న మార్గం ఉంది. తాజాగా ఆయన హరీష్ శంకర్‌పై ఓ ట్వీట్ చేశారు. ‘‘హరీష్ తమ్ముడూ.. నా మీద ఇంత దయ చూపిస్తున్నందుకు ధన్యవాదాలు. నీతో ఫోన్‌లో మాట్లాడిన తర్వాత చాలా సంతోషంగా అనిపించింది. ఇది చాలా చిన్న జీవితం. అందుకే కోట్లాటలు వద్దు.  శత్రుత్వాలు వద్దు..’’ అని బండ్ల గణేష్ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ ట్వీట్ చూసిన వారంతా కరోనా తర్వాత బండ్లలో భీభత్సమైన మార్పు కనిపిస్తుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. Updated Date - 2020-07-27T01:11:12+05:30 IST

Read more