బిగ్‌బాస్‌ సోహైల్‌ హీరోగా...

ABN , First Publish Date - 2020-12-25T05:43:04+05:30 IST

‘‘బిగ్‌ బాస్‌’కి వెళ్లకముందు కొన్ని చిత్రాలు చేశా. అవేవీ సరైన గుర్తింపునివ్వలేదు. ఆ ప్రోగ్రాంతో ఎంతోమంది స్నేహితుల్ని...

బిగ్‌బాస్‌ సోహైల్‌ హీరోగా...

‘‘బిగ్‌ బాస్‌’కి వెళ్లకముందు కొన్ని చిత్రాలు చేశా. అవేవీ సరైన గుర్తింపునివ్వలేదు. ఆ ప్రోగ్రాంతో ఎంతోమంది స్నేహితుల్ని సంపాదించుకున్నా. ముఖ్యంగా చిరంజీవిగారింటి నుంచి బిర్యానీ రావడం, ఆయనతో పాటు నాగార్జునగారి మద్దతు మరువలేను. అన్ని వర్గాల ప్రేక్షకులు, ముఖ్యంగా మహిళల మనసులు గెలుచుకునే చిత్రమిది’’ అని సోహైల్‌ అన్నారు. అతను హీరోగా శ్రీనివాస్‌ వింజనంపాటిని దర్శకుడిగా పరిచయం చేస్తూ అప్పిరెడ్డి ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గురువారం ఫిల్మ్‌ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ‘‘బిగ్‌ బాస్‌’కి ముందే సోహైల్‌కి కథ చెప్పాం. తన పారితోషికంలో 15 శాతం అనాథలకు ఇస్తానని సోహైల్‌ చెప్పడం అతని మంచితనానికి నిదర్శనం’’ అని అప్పిరెడ్డి అన్నారు. ‘‘సినిమా చూశాక ప్రేక్షకులు కంటతడి పెట్టుకుంటూ బయటకొస్తారు’’ అని దర్శకుడు అన్నారు.


Updated Date - 2020-12-25T05:43:04+05:30 IST