బిగ్‌బాస్ మరింత ఆలస్యం...కారణమిదే!
ABN , First Publish Date - 2020-08-25T13:22:55+05:30 IST
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్‌కు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఇటీవల ఈ షో నూతన సీజన్ టీజర్...

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్‌కు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఇటీవల ఈ షో నూతన సీజన్ టీజర్ కూడా విడుదలైంది. దీనికి మంచి ఆదరణ దక్కింది. బిగ్ బాస్ ప్రోమో షూట్ కోసం సల్మాన్ ఖాన్ కొద్ది రోజుల క్రితం పన్వెల్ నుంచి ముంబైకి వెళ్లినట్లు సమాచారం. కాగా ముంబైలో భారీవర్షాల కారణంగా సల్మాన్ ఖాన్ షూటింగ్‌లో పాల్గొనలేకపోతున్నారని, ఈ కారణంగా బిగ్‌బాస్ షూటింగ్ ఆలస్యమవుతున్నదని సమాచారం. ఈ నేపధ్యంలో ఈ షో సెప్టెంబరులో కాకుండా అక్టోబరులో ప్రసారం కావచ్చని అంటున్నారు. వర్షాల కారణంగా బిగ్‌బాస్ హౌస్ సెట్ పనులు నిలిచిపోయాయి.
Read more