వారికి నెగిటివ్ అని తెలిశాక కళ్లలో నీళ్లు ఆగలేదు: బిగ్ బి

ABN , First Publish Date - 2020-07-28T05:29:45+05:30 IST

ఇటీవల కరోనా బారినపడి ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ ఫ్యామిలీ నుంచి నటి ఐశ్వర్యరాయ్

వారికి నెగిటివ్ అని తెలిశాక కళ్లలో నీళ్లు ఆగలేదు: బిగ్ బి

ఇటీవల కరోనా బారినపడి ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ ఫ్యామిలీ నుంచి నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్, ఆరాధ్యలు డిశ్చార్జ్ అయ్యారు. పదిరోజుల అనంతరం పదకొండవ రోజు ఐశ్వర్య రాయ్ అలాగే తన 8 ఏళ్ల కుమార్తె‌ ఆరాధ్యకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగటివ్ అని నిర్ధారణ కావడంతో వైద్యులు వారిని డిశ్చార్జ్ చేసినట్టు అభిషేక్ బచ్చన్ ట్వీట్‌లో తెలిపారు. తాను, తన తండ్రి అమితాబ్ బచ్చన్ ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నట్టుగా ఆయన పేర్కొన్నారు. అయితే తన కోడలు, మనవరాలు కరోనా నెగిటివ్‌తో డిశ్చార్జ్ అయ్యారనే విషయం తెలిసి కళ్లలో నీళ్లు ఆగలేదని బిగ్ బి అమితాబచ్చన్ తన తాజా ట్వీట్‌లో పేర్కొన్నారు.


‘‘హాస్పటల్ నుంచి నా మనవరాలు, కోడలు డిశ్చార్జ్ అయ్యారనే విషయం తెలిసి కళ్లలో నీళ్లు ఆగలేదు. గాడ్.. నీ ఆశీస్సులు అనంతం..’’ అని అమితాబ్ ట్వీట్ చేశారు. మొత్తంగా చూస్తే.. తనకు కరోనా వచ్చిందనే బాధ కంటే తన కుటుంబంలోని ముఖ్యంగా తన మనవరాలిగా కరోనా అని తెలిసి అమితాబ్ ఎక్కువగా బాధపడినట్లుగా తెలుస్తుంది. ఆ బాధలోనే ఆయన ఇప్పటి వరకు కోలుకోలేకపోయారనే కామెంట్స్ కూడా వినబడుతున్నాయి. ఇప్పుడు మనవరాలు, కోడలు క్షేమంగా వచ్చేశారు కాబట్టి.. తన కుమారుడితో కలిసి ఆయన కూడా త్వరలోనే క్షేమంగా తన ఇంటికి వచ్చేయాలని కోరుకుందాం.   Updated Date - 2020-07-28T05:29:45+05:30 IST