కేబీసీ సెట్స్‌లో బిగ్ బి!
ABN , First Publish Date - 2020-08-25T05:24:45+05:30 IST
కరోనా నుంచి బిగ్ బి అమితాబ్ కోలుకుని కొన్ని రోజులైనా కాలేదు. కానీ ఆయన చాలా ధైర్యంగా సెట్స్‌లో అడుగుపెట్టారు...

కరోనా నుంచి బిగ్ బి అమితాబ్ కోలుకుని కొన్ని రోజులైనా కాలేదు. కానీ ఆయన చాలా ధైర్యంగా సెట్స్‌లో అడుగుపెట్టారు. కేబీసీ (కౌన్ బనేగా కరోడ్‌పతి) 12వ సీజన్ చిత్రీకరణ ప్రారంభించారు. ‘‘నీలిరంగు పీపీఈ కిట్ల సముద్రంలో మళ్లీ పని చేయడం ప్రారంభించా. 2000లో కేబీసీ ప్రారంభమైంది. ఇప్పుడు 2020లో ఉన్నాం... ఇరవై ఏళ్లు ప్రయాణమిది. ఇదొక అద్భుతం... జీవిత కాల అనుభవం’’ అని అమితాబ్ పేర్కొన్నారు.
Read more